పీలే: బ్రెజిల్ సాకర్ దిగ్గజం అస్తమయం

వీడియో క్యాప్షన్, ఫుట్‌బాల్ దిగ్గజం పీలే మరణంతో విషాదంలో ప్రపంచ క్రీడాభిమానులు
పీలే: బ్రెజిల్ సాకర్ దిగ్గజం అస్తమయం

ఫుట్‌బాల్ స్టార్ పీలే మృతికి నివాళిగా మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది బ్రెజిల్ ప్రభుత్వం.

82 ఏళ్ల పీలే సావ్‌ పావ్లో ఆసుపత్రిలో క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ కన్నుమూశారు. అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా పీలేకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.

తన కెరీర్‌లో మూడు ప్రపంచ కప్‌లను గెలిచిన ఏకైక సాకర్ ప్లేయర్ ఆయన. అనేక అవార్డులు, బిరుదులు అందుకున్నారు.

ఫుట్‌బాల్‌ను ఒక మతంగా ఆరాధించే బ్రెజిల్‌లో పీలే తిరుగులేని కథానాయకుడు. తన ఆటతో దేశాన్ని ఏకం చెయ్యడంతో పాటు.. దేశాభివృద్ధి కోసం, సమాజంలో పేదల ఉన్నతి కోసం పోరాడారు.

పీలే

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)