తిరుమల నడకదారిలో క్రూరమృగాలు ఎందుకొస్తున్నాయి
తిరుమల నడకదారిలో చిరుత దాడితో చిన్నారి చనిపోవడంపై సోషల్ మీడియాలో, జనంలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.
తూర్పు కనుమల్లోని శేషాచలం కొండల్లో తిరుమల ఉంది. వేంకటేశ్వరున్ని దర్శించుకోవడానికి అడవుల గుండా నడక దారి, వాహన మార్గాలు ఉన్నాయి.
అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో చిరుత దాడి జరిగింది. ఇటీవలి కాలంలో ఇది రెండో ఘటన.
ఈ ఏడాది జూన్‌లో జరిగిన దాడిలో అయిదేళ్ల బాలుడు గాయపడగా, ఆగస్టు 11 రాత్రి జరిగిన దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందింది.
దీంతో మెట్ల మార్గంలోకి చిరుతలు, ఇతర జంతువులు ఎందుకొస్తున్నాయనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.












