‘నాన్నా.. నీకు మంచి పేరు తెస్తా అని చెప్పేది’ - మహిళా క్రికెటర్ శ్రీచరణి తల్లిదండ్రులు ఏం చెప్పారంటే

వీడియో క్యాప్షన్,
‘నాన్నా.. నీకు మంచి పేరు తెస్తా అని చెప్పేది’ - మహిళా క్రికెటర్ శ్రీచరణి తల్లిదండ్రులు ఏం చెప్పారంటే

మహిళల ఈ ప్రపంచ కప్ 2025లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లలో ఒకరిగా శ్రీచరణి నిలిచింది.

ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ 2025లో ఆమె ఆడిన మొత్తం 9 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీయడంతో ఈ జాబితాలో శ్రీచరణి నాలుగో స్థానంలో నిలిచినట్లు ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్ పేర్కొంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆమె డబ్ల్యూపీఎల్ లీగ్‌లో అరంగేట్రం చేసింది.

ఈ మ్యాచ్‌లో కీలకమైన వికెట్లు తీసింది. ఈ లీగ్‌లో దిల్లీ క్యాపిటల్స్ రన్నరప్‌గా నిలిచింది.

చిన్నతనంలో అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న శ్రీచరణి క్రికెట్‌లోకి ఎందుకొచ్చింది.

కడప నుంచి వరల్డ్ కప్ అందుకునే వరకు శ్రీచరణి ప్రయాణం ఎలా సాగిందో ఆమె తల్లిదండ్రుల మాటల్లోనే చూడండి..

శ్రీ చరణి, విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)