బంగ్లాదేశ్‌ ఆర్మీ ఏం చెప్పింది - ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితిపై 5 ప్రశ్నలు, సమాధానాలు

Modi, Sheikh Hasina

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నరేంద్ర మోదీ, షేక్ హసీనా(పాత చిత్రం)

బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఏకంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి దిగిపోయేలా చేయడంతో పాటు దేశం విడిచి పారిపోయేలా చేశాయి.

దేశవ్యాప్తంగా అల్లర్లు జరగడం, పోలీసుల కాల్పుల్లో వందలాది మంది మరణించడం, పరిస్థితులు అదుపుతప్పడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు.

ఆ తరువాత ఆమె సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోవడంతో అక్కడ రాజకీయంగా ఏం జరుగుతోంది? ఆర్మీ చీఫ్ ఏం చెప్పారు? అసలు షేక్ హసీనా భారత్‌కే ఎందుకొచ్చారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశంలో శాంతిభద్రతలను ఆర్మీ పర్యవేక్షిస్తుందని వాకర్-ఉజ్-జమాన్ అన్నారు.

1) దేశాన్ని ఆర్మీ ఆధీనంలోకి తీసుకుందా?

ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో ‘దేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కానుంది’ అని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ ప్రకటించారు.

అయితే దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ లేదా ఎమర్జెన్సీని విధించాల్సిన అవసరం లేదన్నారు. ఆర్మీ చీఫ్ సోమవారం బంగ్లాదేశ్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌ను కలవబోతున్నానని, పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నానని వాకర్-ఉజ్-జమాన్ చెప్పారు.

ప్రస్తుత పరిస్థితిపై దేశంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో ఇప్పటికే మాట్లాడినట్లు ఆయన తెలిపారు. నిరసనకారులు ఆందోళనలు విరమించాలని, ఇళ్లకు వెళ్లిపోవాలని ఆయన కోరారు. దేశంలో శాంతిభద్రతలను ఆర్మీ పర్యవేక్షిస్తుందని వాకర్-ఉజ్-జమాన్ అన్నారు.

‘’అందరూ మద్దతుగా నిలవాలి, మీతో యుద్ధం చేసి మేమేం గెలవలేం, ఆందోళనలు ఆపండి. అందరం కలిసి అందమైన దేశాన్ని నిర్మించుకుందాం’’ అని ఆర్మీ చీఫ్ అన్నారు.

గత కొన్ని వారాలుగా జరిగిన అల్లర్లలో నష్టపోయిన బాధితులకు, మృతులకు న్యాయం చేస్తామని ఆర్మీ చీఫ్ హామీ ఇచ్చారు.

ఘటనలపై పూర్తి విచారణ జరుపుతామని చెప్పారు. అయితే, ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారనే దానిపై ఆర్మీ చీఫ్ స్పష్టత ఇవ్వలేదు.

షేక్ హసీనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు.

2) రాజీనామాకు కారణం ఏంటి?

పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో జరిగిన యుద్ధంలో పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు చాలా రోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

1971 నాటి బంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిని ఇక్కడ యుద్ధవీరులుగా పేర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడింట ఒక వంతు వారి పిల్లలకు రిజర్వ్ చేశారు. మరికొన్ని ఉద్యోగాలు మహిళలు, మైనారిటీలు, వికలాంగులకు రిజర్వ్ అయి ఉంటాయి.

యుద్ధవీరుల పిల్లల కోసం మూడింట ఒకవంతు పోస్ట్‌లు కేటాయించడం వివక్షతో కూడుకున్నదని, ప్రతిభ ఆధారంగానే రిక్రూట్‌మెంట్‌ జరగాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

2018లో ఇలాంటి నిరసనలే వెల్లువెత్తడంతో షేక్ హసీనా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది. కానీ, ఆ కోటాను పునరుద్ధరించాలని 2024 జూన్ ప్రారంభంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తాజా ఆందోళనలకు దారితీసింది. హైకోర్టు ఇచ్చిన ఆ ఆదేశాలను రద్దు చేయాలని అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో, తాజా విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

93 శాతం ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా ఇవ్వాలని, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 5 శాతం, మైనార్టీలకు 1 శాతం, వికలాంగులు, థర్డ్ జెండర్‌లకు 1 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది.

అయినా కూడా దేశంలో నిరసనలు ఆగలేదు. కోటా రద్దు డిమాండ్ను వదిలి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోవాలన్న డిమాండ్‌తో నిరసనలు తీవ్ర రూపందాల్చాయి.

షేక్ హసీనా, భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత కొన్నేళ్లుగా షేక్ హసీనా, ఆమె ప్రభుత్వానికి భారత్ బలమైన మిత్రదేశంగా ఉంది.

3) హసీనా భారత్‌కే ఎందుకొచ్చారు?

రాజీనామా అనంతరం షేక్ హసీనా భారతదేశానికి వచ్చారు. భారత్ తనకు "సురక్షితమైన ప్రదేశం"గా ఆమె పరిగణించారు.

గత కొన్నేళ్లుగా షేక్ హసీనా, ఆమె ప్రభుత్వానికి భారత్ బలమైన మిత్రదేశంగా ఉంది.

బంగ్లాదేశ్ అనేక ఈశాన్య భారత రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటోంది, ఈ ప్రాంతాలు చాలావరకు తీవ్రవాద సమస్యలను ఎదుర్కొన్నాయి.

హసీనా తన పదవీ కాలంలో బంగ్లాదేశ్‌ కేంద్రంగా పనిచేసే భారత వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులపై చర్యలు తీసుకున్నారు.

ఇది భారతదేశంతో బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేసింది.

అంతేకాదు భారత్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు సరకులు రవాణా చేయడానికి హసీనా ప్రభుత్వం హక్కులను మంజూరు చేసింది. ఈ మద్దతు రెండు దేశాల మధ్య సంబంధాన్ని మరింత పటిష్టం చేసింది.

షేక్ హసీనా 1996లో బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి భారతదేశంతో సన్నిహితంగా ఉన్నారు. ఆమె ఢాకా, దిల్లీల మధ్య సంబంధాలను సమర్థించారు.

బంగ్లాదేశ్ కోసం 1971లో స్వాతంత్య్ర సమరంలో భారత్ నుంచి అందిన కీలకమైన మద్దతును 2022లో ఇండియా పర్యటన సందర్భంగా హసీనా గుర్తు చేసుకున్నారు.

అయితే, ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ (హసీనా పార్టీ)తో సన్నిహితంగా ఉండడం కాకుండా బంగ్లాదేశ్ ప్రజల విస్తృత ప్రయోజనాలకు భారత్ మద్దతు ఇవ్వాలని అక్కడి ప్రతిపక్షాలు విమర్శించాయి.

బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్
ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్

4) బంగ్లాదేశ్‌లో ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు?

బంగ్లాదేశ్‌లో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆ ఎన్నికలను బహిష్కరించింది. ఎన్నికల్లో అవామీ లీగ్‌, దాని మిత్రపక్షాలు 300 స్థానాలకు గానూ 225 స్థానాలలో గెలిచాయి.

దీంతో అవామీ లీగ్ పార్టీ నాయకురాలిగా ఉన్న షేక్ హసీనా ఇన్నాళ్లు ప్రధానిగా కొనసాగారు. ఆందోళనల నేపథ్యంలో ఆమె పదవికి రాజీనామా చేయడంతో ప్రతిష్టంభన ఏర్పడింది.

దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆర్మీ చీఫ్ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పినప్పటికీ , ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

jai shankar

ఫొటో సోర్స్, Getty Images

5) భారత ప్రభుత్వం ఎలా స్పందించింది? విపక్షాలు ఏమంటున్నాయి

బంగ్లాదేశ్’లో రాజకీయ అస్థిరత, షేక్ హసీనా రాజీనామాలపై భారత్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

షేక్ హసీనా తొలుత భారత్‌లోని అగర్తలకు, అక్కడి నుంచి దిల్లీకి చేరుకున్నప్పటికీ భారత ప్రభుత్వం వైపు నుంచి దీనిపై ఎవరూ స్పందించలేదు.

అయితే, షేక్ హసీనా ప్రయాణించిన సీ-130 విమానం ల్యాండ్ అయిన దిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ వెళ్లినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌తోొ భేటీ అయ్యారు.

వారిద్దరూ బంగ్లాదేశ్ వ్యవహారాలపై చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

మరోవైపు బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయుల భద్రతకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సరిహద్దులలో అప్రమత్తంగా ఉండాలని.. బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో భారత వైఖరి ఏంటో దేశ ప్రజలకు తెలియజెప్పాలని కాంగ్రెస్ నేతలు, కార్తీ చిదంబరం, మనీశ్ తివారి, గౌరవ్ గొగోయి వంటివారు సూచించారు.

బంగ్లాదేశ్‌తో సరిహద్దులున్న భారత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ సీఎం దీనిపై మాట్లాడుతూ.. బెంగాల్ ప్రజలు శాంతియుతంగా ఉండాలని, వదంతులు నమ్మరాదని కోరారు. ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)