You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ధర్మేంద్రకు పద్మ విభూషణ్, నోరి దత్తాత్రేయుడికి పద్మ భూషణ్, రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, రోహిత్ శర్మకు పద్మశ్రీ.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరంటే
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇటీవల మరణించిన సినీ నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
క్రీడలు, కళలు, ప్రజాసేవా రంగాలలో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులకు ఈ ఏడాది అవార్డులు దక్కాయి.
ధర్మేంద్ర సహా ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.
తెలుగువారైన ప్రముఖ వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ వరించింది.
పద్మశ్రీ వరించినవారిలో తెలుగువారు
- గద్దె బాబూ రాజేంద్రప్రసాద్ (కళారంగం)
- కుమారస్వామి రంగరాజ్ (హైదరాబాద్ సీసీఎంబీ శాస్త్రవేత్త)
- రామారెడ్డి మామిడి (పశుసంవర్థకం)
- వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం, విద్య)
- చంద్రమౌళి గడ్డమణుగు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్)
- దీపికారెడ్డి (కళలు)
- గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం, కళలు)
- గూడూరు వెంకటరావు (మెడిసిన్)
- కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్)
- మాగంటి మురళీమోహన్ (కళలు)
- పాల్కొండ విజయ్ ఆనంద్‌రెడ్డి (మెడిసిన్)
- మామిడాల జగదీశ్ కుమార్ (విద్య- సాహిత్యం)
కాగా యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ దిల్లీ కోటాలో పద్మశ్రీ పురస్కారం దక్కింది.
పద్మ విభూషణ్ గ్రహీతలు:
ధర్మేంద్ర: సినీ నటుడు (మరణానంతరం)
కె.టి.థామస్: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
ఎన్.రాజం: వయోలిన్ విద్వాంసులు (కళా రంగం)
పి.నారాయణన్: సాహిత్యం, విద్యా రంగంలో చేసిన కృషికి..
వీఎస్.అచ్యుతానందన్: కేరళ మాజీ ముఖ్యమంత్రి (మరణానంతరం)
పద్మ భూషణ్ ఎవరెవరికి?
డాక్టర్ నోరి దత్తాత్రేయుడు: వైద్యుడు
అల్కా యాజ్ఞిక్: గాయని (కళా రంగం)
భగత్ సింగ్ కోశ్యారీ: మహారాష్ట్ర మాజీ గవర్నర్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం (ప్రజా వ్యవహారాలు)
రామస్వామి పళనిస్వామి (వైద్యం)
మమ్ముట్టి: మలయాళ నటుడు (కళా రంగం)
పీయూష్ పాండే (కళారంగం) - మరణానంతరం
ఎస్‌కేఎం మేళనందన్ - సోషల్ వర్క్
శతావధాని ఆర్ గణేశ్ - కళలు
శిబు సొరేన్ - పబ్లిక్ అఫైర్స్ - మరణానంతరం
ఉదయ్ కోటక్: ప్రముఖ బ్యాంకర్ (వర్తకం, పరిశ్రమలు).
వీకే మల్హోత్రా - పబ్లిక్ అఫైర్స్ - మరణానంతరం
వెల్లపల్లి నటేశన్ - పబ్లిక్ అఫైర్స్
విజయ్ అమృత్‌రాజ్: మాజీ టెన్నిస్ ఆటగాడు (క్రీడలు)
పద్మ శ్రీ పొందినవారిలో కొందరు..
రోహిత్ శర్మ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ (క్రీడలు).
హర్మన్‌ప్రీత్ కౌర్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ (క్రీడలు).
ఆర్.మాధవన్: ప్రముఖ నటుడు, దర్శకుడు (కళా రంగం).
సవిత పునియా: భారత మహిళా హాకీ జట్టు క్రీడాకారిణి (క్రీడలు).
ప్రవీణ్ కుమార్: బౌలర్ (క్రీడలు)
ప్రసేన్‌జిత్ ఛటర్జీ - నటుడు (కళలు)
పద్మ పురస్కారాల నేపథ్యం...
ప్రారంభం: పద్మ పురస్కారాలను 1954 సంవత్సరంలో ప్రారంభించారు.
పురస్కార శ్రేణులు:
పద్మ విభూషణ్: అసాధారణ, విశిష్ట సేవలకు ఇచ్చే పురస్కారం.
పద్మ భూషణ్: ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు ఇచ్చే పురస్కారం.
పద్మ శ్రీ: ఏదైనా రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే పురస్కారం.
ఎంపిక ప్రక్రియ:
ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశం ప్రత్యేక కృషిని గుర్తించడం. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం తదితర రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి వీటిని అందజేస్తారు.
సాధించిన విజయాలలో ప్రజా సేవ అంశం ఉండటం తప్పనిసరి.
ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి ఒక పద్మ అవార్డుల కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ సిఫార్సులను ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఆమోదిస్తారు.
ప్రదానోత్సవం, బహుమతులు:
పేర్లు ప్రకటించిన తర్వాత రాష్ట్రపతి భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.
విజేతలకు రాష్ట్రపతి సంతకం, ముద్రతో కూడిన ప్రశంసాపత్రం, ఒక పతకం అందజేస్తారు.
అవార్డు గ్రహీతలకు పతకం తాలూకా ప్రతిరూపాన్ని కూడా ఇస్తారు, దీనిని వారు అధికారిక కార్యక్రమాలలో ధరించవచ్చు.
ముఖ్యమైన నిబంధనలు:
బిరుదు కాదు: పద్మ పురస్కారాలు కేవలం గౌరవ సూచకాలు మాత్రమే, ఇవి బిరుదులు కావు. కాబట్టి వీటిని పేరుకు ముందు లేదా వెనుక (ఉదాహరణకు లెటర్ హెడ్స్, పోస్టర్లు, పుస్తకాలపై) రాసుకోకూడదు.
సదుపాయాలు: అవార్డు గ్రహీతలకు ఎటువంటి నగదు బహుమతి, రైలు లేదా విమాన ప్రయాణాలలో రాయితీలు ఉండవు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)