You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పద్మ అవార్డ్స్ 2020 : జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు మరణానంతరం పద్మ విభూషణ్.. పీవీ సింధుకు పద్మభూషణ్
కేంద్ర ప్రభుత్వం 2020 ఏడాదికిగానూ పద్మ అవార్డులను ప్రకటించింది.
క్రీడారంగంలో ప్రతిభ చూపినందుకు బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధును పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది.
సింధు (తెలంగాణ నుంచి) సహా మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు వచ్చాయి.
తెలంగాణ నుంచి చింతల వెంకట్ రెడ్డి (వ్యవసాయం) , శ్రీభాష్యం విజయసారథి (విద్య, సాహిత్యం).. ఆంధ్రప్రదేశ్ నుంచి యడ్ల గోపాలరావు (కళలు), దలవాయి చలపాతి రావు (కళలు) పద్మ శ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.
ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంగా మొత్తంగా 141 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
ఏడుగురిని పద్మ విభూషణ్, పదహారు మందిని పద్మ భూషణ్ అవార్డులకు ఎంపిక చేసింది.
కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ జైట్లీ, జార్జ్ ఫెర్నాండెజ్, సుష్మస్వరాజ్‌లతోపాటు కర్నాటకకు చెందిన విశ్వేశ తీర్థ స్వామీజీకి మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి.
వీరితో పాటు మేరీ కోమ్, చెన్నూ లాల్ మిశ్ర, అనిరుధ్ జుగ్నౌద్ కూడా పద్మ విభూషణ్ దక్కినవారిలో ఉన్నారు.
పద్మ అవార్డులకు ఎంపికనవారికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
పద్మ భూషణ్ అవార్డులకు ఎంపికైనవారి జాబితా:
- పీవీ సింధు (తెలంగాణ, క్రీడలు)
- ఎం. ముంతాజ్ అలీ (కేరళ, ఆధ్యాత్మికం)
- సయ్యద్ మౌజం అలీ (బంగ్లాదేశ్, ప్రజావ్యవహారాలు)
- ముజఫర్ హుస్సేన్ బేగ్ (జమ్మూకశ్మీర్, ప్రజావ్యవహారాలు)
- అజోయ్ చక్రవర్తి (బెంగాల్, కళలు)
- మనోజ్ దాన్ (పుదుచ్చేరి, సాహిత్యం & విద్య)
- బాలకృష్ణ దోషి (గుజరాత్, ఆర్కిటెక్చర్)
- కృష్ణమ్మల్ జగన్నాథన్ (తమిళనాడు, సమాజ సేవ)
- ఎస్‌సీ జామిర్ - (నాగాలాండ్, ప్రజావ్యవహారాలు)
- అనిల్ ప్రకాశ్ జోషి (ఉత్తరాఖండ్, సమాజ సేవ)
- సెరింగ్ లండోల్ (లద్దాఖ్, వైద్యం)
- ఆనంద్ మహీంద్రా (మహారాష్ట్ర, వాణిజ్యం & పరిశ్రమలు)
- నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (కేరళ, ప్రజావ్యవహారాలు-మరణానంతరం)
- మనోహర్ పారికర్ (గోవా, ప్రజావ్యవహారాలు-మరణానంతరం)
- జగదీశ్ సేఠ్ (అమెరికా, విద్య & సాహిత్యం)
- వేణు శ్రీనివాసన్ (తమిళనాడు, వాణిజ్యం & పరిశ్రమలు)
పద్మశ్రీ అవార్డులకు ఎంపికైనవారి జాబితా :
ఇవి కూడా చదవండి:
- దారా షికోహ్: సోదరుడి తల నరికి షాజహాన్కు బహుమతిగా పంపిన ఔరంగజేబ్
- సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందా?
- 'ఆ తెగలో వృద్ధ మహిళలను నరికి చంపేస్తారు. పురుషులకు మరో రకమైన శిక్ష ఉంటుంది'
- చలికి గడ్డ కట్టుకుని చనిపోయిన పసిబిడ్డ
- ITలో ఈ ఆరు కోర్సులతోనే మంచి అవకాశాలు
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- India Vs New Zealand: శ్రేయస్ దూకుడు.. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)