ఇళయరాజా, ధోనీ, శ్రీకాంత్‌లకు 'పద్మ' అవార్డులు

కేంద్ర ప్రభుత్వం 2018 పద్మ అవార్డుల జాబితాను గురువారం విడుదల చేసింది. తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ పురస్కారం దక్కింది.

సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్, వ్యాపారం, కళలు.. ఇలా వివిధ రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకున్నవారికి ప్రభుత్వం ఏటా పద్మ అవార్డులను అందిస్తుంది.

సినీ సంగీత ప్రియులకు సుపరిచితులైన దక్షిణాది సంగీత దర్శకుడు ఇళయరాజాకు పద్మవిభూషణ్ అవార్డు దక్కింది.

భారత క్రికెట్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీకి పద్మభూషణ్, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.

ఇళయరాజాతో పాటు మహారాష్ట్రకు చెందిన సంగీత కళాకారుడు గులామ్ ముస్తఫా ఖాన్‌, కేరళకు చెందిన పరమేశ్వరన్ కూడా పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.

ధోనీ సహా తొమ్మిది మందిని పద్మ భూషణ్ అవార్డు వరించింది.

మొత్తం 14మంది మహిళలు పద్మ అవార్డుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. మరణానంతరం ముగ్గురికి పద్మ పురస్కారాలు లభించాయి.

కర్ణాటకకు చెందిన సీతవ్వ, తమిళనాడుకు చెందిన విజయ లక్ష్మి, త్రిపురకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవర్మన్, మహారాష్ట్రకు చెందిన అరవింద్ గుప్తా మొదలైన 73మంది పద్మశ్రీ పురస్కారం పొందిన వాళ్లలో ఉన్నారు.

పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు

పద్మ భూషణ్ అవార్డు గ్రహీతలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)