ఇండియా vs న్యూజీలాండ్: నెంబర్1 ర్యాంకుకు మరో అడుగు దూరంలో టీమ్ ఇండియా

టీమిండియా

ఫొటో సోర్స్, ANI

న్యూజీలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో టీమిండియా ఓడిచింది.

ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 జట్టుగా అవతరించేందుకు భారత జట్టు మరో అడుగు దూరంలో నిలిచింది.

న్యూజీలాండ్ చేజారిన ర్యాంక్

ఈ ఓటమితో న్యూజీలాండ్‌ జట్టు నంబర్‌-1 కిరీటాన్ని చేజార్చుకుంది. ఇప్పుడు ఆ జట్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ 2కి రాగా, ఇంగ్లండ్ నంబర్-1కి ఎగబాకింది.

అదే సమయంలో, ఈ మూడు జట్ల రేటింగ్ సమానంగా (113 పాయింట్లు) ఉండగా, భారత జట్టు నంబర్-3లో ఉంది.

ఇప్పుడు భారత్ తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి నెం.1 జట్టుగా అవతరిస్తుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఆరంభం నుంచే ఒత్తిడిలో న్యూజీలాండ్‌ బ్యాటింగ్‌

న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్‌పై భారత బౌలర్లు ఆరంభం నుంచే ఒత్తిడి పెంచారు. నలుగురు న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ 15 పరుగులలోపే అవుట్ అయ్యారు.

ఓపెనర్ ఫిన్ అలెన్ తొలి ఓవర్‌లోనే బౌల్డ్ అయ్యాడు. హెన్రీ నికోల్స్ (2), డారిల్ మిషెల్ (1), డెవాన్ కాన్వే (7) సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు.

తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ 17 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేయగలిగాడు.

న్యూజీలాండ్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్ అత్యధికంగా 36 పరుగులు చేశాడు. 52 బంతుల్లో అయిదు ఫోర్లు సాధించాడు.

మైకేల్ బ్రేస్‌వెల్ 22 పరుగులు మాత్రమే చేసి మహ్మద్ షమీ చేతిలో అవుట్ అయ్యాడు. 27 పరుగుల వద్ద మిషెల్ శాంట్నర్‌ను పాండ్యా బౌల్డ్ చేశాడు.

మరే ఇతర న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. న్యూజీలాండ్ జట్టు 34.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

భారత బౌలర్లలో మహ్మద్ షమీ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఆరు ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.

హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.

టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో బౌలింగ్ ఎంచుకోవాలా, బ్యాటింగ్ ఎంచుకోవాలా అనే విషయాన్ని చెప్పడంలో కెప్టెన్ రోహిత్ శర్మ తడబడ్డాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

భారత్‌పై న్యూజీలాండ్‌ మూడో అత్యల్ప స్కోరు

భారత్‌పై, 2016లో విశాఖపట్నంలో జరిగిన వన్డేలో న్యూజీలాండ్ 79 పరుగులు చేసింది. ఇదే ఇప్పటి వరకు భారత్‌పై దాని అత్యల్ప స్కోరు.

2010లో జరిగిన చెన్నై వన్డేలో, న్యూజీలాండ్‌ను భారత్ 103 పరుగులకు కట్టడి చేసింది.

15 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో తొలి వన్డే.

రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించారు. దీంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ నిర్వహణకు ఈ స్టేడియం 50వ వేదికగా మారింది.

రాయ్‌పూర్‌లోని ఈ స్టేడియం 2008లో నిర్మించారు. దీనిని నిర్మించిన తర్వాత ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడటానికి 15 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది.

65,000 మంది కూర్చునే సామర్థ్యంతో, ఈ స్టేడియం భారతదేశంలో మూడవ అతిపెద్ద స్టేడియం. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద స్టేడియం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)