అమెరికాలో మంచు తుపాను తీవ్రతను చూపించే 14 ఫోటోలు ఇవి..

అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్‌లో ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారిని స్లెడ్ (మంచు మీద లాక్కెళ్లడానికి ఉపయోగించే వాహనం) మీద ఇలా తీసుకెళ్తూ కనిపించారు. విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పలు ప్రాంతాల్లో 20 అంగుళాలకు పైగా మంచు కురిసింది. ఇంటి కప్పులు, పెరటి తోటలు, రోడ్లు ఇలా మంచుతో కప్పుకునిపోయాయి. ప్రజలు హీటర్లు ఉపయోగిస్తుండటంతో చాలాచోట్ల విద్యుత్ డిమాండ్ బాగా పెరిగిపోయింది.
అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్‌లోని అల్బనీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దగ్గర పార్క్ చేసిన కార్లపై మంచు ఇలా పేరుకుపోయి కనిపించింది. చలి తీవ్రత కారణంగా దేశవ్యాప్తంగా రెండు డజన్లమందికి పైగా చనిపోయినట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోడ్ల మీద మంచు పేరుకుపోవడంతో వాహనాలు నడపడం కష్టంగా మారింది. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు కార్లు వదిలేసి నడుచుకుంటూ తమ పనులు చేసుకుంటూ కనిపించారు. అధిక వినియోగం కారణంగా చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ నగరంలో ఓ వ్యక్తి మంచులో కూరుకుపోయిన తన కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్న దృశ్యం. ఈ వారాంతంలో తూర్పు ప్రాంతాన్ని మరోసారి మంచు తుపాను తాకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్‌లోని అల్బనీ ఎయిర్‌పోర్టులో కనిపించిన దృశ్యం ఇది. మంచు ప్రభావంతో అమెరికాలో 10వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. అనేక ఎయిర్‌పోర్టులో ప్రయాణీకులు పడిగాపులు పడుతూ కనిపించారు. రన్‌వేలపై మంచు తొలగించడం పెద్ద పనిగా మారింది.
అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్‌లోని ఓ పార్కులో ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్‌ నుంచి వచ్చే నీరు కూడా గడ్డగట్టింది. పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు పడిపోయాయి. జనం ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు.
అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓ ఇంటి ముందు పార్క్ చేసిన కారును కప్పేసిన మంచు ఇది. మంచు కారణంగా ఇంటికి దారి కూడా మూసుకుపోయింది. టెనెస్సీ, లూసియానా, మసాచుసెట్స్, కాన్సాస్, పెన్సిల్వేనియా రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల నుంచి మరణాలు రిపోర్ట్ అయ్యాయి.
అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పెన్సిల్వేనియా రాష్ట్రంలోని షార్ప్స్‌బర్గ్ నగరంలోని దృశ్యం ఇది. ఇంటి మీద, రోడ్ల మీదా మంచు పేరుకుపోవడం వీధులన్నీ శ్వేతవర్ణంలోకి మారి కనిపించాయి. రోడ్ల మీద జనం చాలా పలచగా కనిపించారు.
అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పేరుకుపోయిన మంచును యంత్రాలతో తొలగిస్తున్న సిబ్బంది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, ఈ వారం మొత్తం మంచు, చలి తీవ్రతలు కొనసాగే అవకాశం ఉందని ప్రజలను అధికారులు హెచ్చరించారు.
అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టెన్నెసీ రాష్ట్రంతోపాటు పలురాష్ట్రాల్లో విద్యుత్ తీగలకు సైతం మంచు వేలాడుతూ కనిపించింది. టెన్నెసీ స్టేట్‌లో 2 లక్షలమందికిపైగా ప్రజలు విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారు.
అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పేరుకున్న మంచును తొలగించి రోడ్లను సిద్ధం చేయడం కోసం అధికార యంత్రాంగం అవిశ్రాంతంగా పని చేయాల్సి వస్తోంది. మంచు తుపాన్ ప్రభావం ఇంకా ముగియలేదని మసాచుసెట్స్ గవర్నర్ హెచ్చరించారు.
అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెనడాలోని టొరంటోలో ఒక వీధిలో కనిపించిన మంచు ఇది. ఆ దేశంలోని ఒట్టావా, క్యూబెక్ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మంచుకురిసింది. రవాణాకు అంతరాయం కలగడంతోపాటు, చలి కారణంగా పలు ప్రాంతాలలో స్కూళ్లు తెరుచుకోలేదు.
అమెరికా, మంచు తుపాన్, విద్యుత్ సరఫరా, ప్రతికూల వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ ముందు యువతీ యువకులు స్లెడ్‌ల మీద ఆడుకుంటూ కనిపించారు. ఇప్పటికే విపరీతమైన చలి ఉండగా, ఈ నెల 30నుంచి మరో మంచు తుపాను ప్రారంభమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)