వాటర్ ట్యాంక్ ఎక్కిన ఎద్దు..
వాటర్ ట్యాంక్ ఎక్కిన ఎద్దు..
ఎద్దు ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కింది. ఈ ఘటన సెప్టెంబర్ 13న రాజస్థాన్‌లోని అజ్మేర్‌కు సమీపంలోని టంకావాస్ గ్రామంలో జరిగింది. ఈ ట్యాంక్ ఎత్తు సుమారు 60 అడుగులుంటుంది.
ఇది చూసిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు.
అయితే, అధికారులు పైకెక్కి ఎద్దును సురక్షితంగా కిందకు తీసుకురావడానికి ప్రయత్నించారు.
కానీ, ఎద్దు వీళ్లను చూసి భయపడి..పై నుంచి దూకడానికి ప్రయత్నించిందని స్థానిక జర్నలిస్ట్ ఒకరు చెప్పారు. దీంతో, అధికారులు కిందికి వచ్చారు.
ఆ తర్వాత చీకటి పడ్డాక చూస్తే ఎద్దు ఆ ట్యాంక్ పై కనిపించలేదని గ్రామస్థులు తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









