మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు మంచిదా? లేక హోం లోన్, కార్ లోన్ ఉత్తమమా?

వీడియో క్యాప్షన్, మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు మంచిదా? లేక హోం లోన్, కార్ లోన్ ఉత్తమమా?
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు మంచిదా? లేక హోం లోన్, కార్ లోన్ ఉత్తమమా?

గతవారం ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ మార్కెటింగ్ శాఖాధిపతి మాట్లాడుతూ తమ సంస్థ కార్ల విక్రయాలు మ్యూచువల్ ఫండ్స్ SIP వల్ల పెరగడం లేదని అన్నారు. నెలకు యాభైవేల రూపాయల SIP చేసే వారి చేత ఆ అలవాటు మాన్పించేస్తే తమ కార్ల విక్రయాలు విపరీతంగా పెరుగుతాయని పేర్కొన్నారు.

ఈ రెండు విషయాలకు ఒక మౌలికమైన తేడా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మదుపు. సొంత కారు అనేది ఒక ఖర్చు. మధ్యతరగతి వారు గతంలో చేసే పోస్టాఫీస్ లేదా బ్యాంక్ చిన్న మొత్తాల పొదుపును ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ ఎస్.ఐ.పి ఆక్రమించింది.

పర్సనల్ ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు కారు అనేది ఒక లగ్జరీ వస్తువు అనే అభిప్రాయం రెండవ శ్రేణి పట్టణాలలో ఇంకా బలంగానే ఉంది (టాటా నానో విఫలమైనప్పుడు తెలుసుకున్న విషయాలలో ఇదీ ఒకటి). ఈ కారణంగానే చాలామంది ఇది మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టడం అని కొట్టి పారేశారు.

ఇంకొందరు ఇది మారుతున్న ప్రజల అభిరుచులను ప్రతిబింబిస్తోందని అన్నారు. ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా, అసలు మ్యూచువల్ ఫండ్స్ మదుపుకు కారు విక్రయాలకు ఎలాంటి సంబంధం ఉందో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)