ఆస్కార్ 2026 నామినేషన్ల వెల్లడి: విమర్శకులు ఆశ్చర్యపోయిన 8 అంశాలు ఇవే

ఆస్కార్ నామినేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెస్సీ బక్లీ (ఎడమ), రోజ్ బైర్న్ (కుడి) ఉత్తమ నటి నామినేషన్లు దక్కించుకోగా, టెయానా టేలర్ (మధ్య) ఉత్తమ సహాయనటి నామినేషన్ పొందారు.
    • రచయిత, స్టీవెన్ మెకింతోష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ ఏడాది (2026) ఆస్కార్ నామినేషన్లను హాలీవుడ్ వెల్లడించింది.

సిన్నర్స్ చిత్రం రికార్డు స్థాయిలో 16 నామినేషన్లతో అత్యధిక ఆస్కార్ నామినేషన్ల రికార్డును బద్దలు కొట్టింది. గతంలో అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న జాబితాలో ఆల్ ఎబౌట్ ఈవ్ (1950), టైటానిక్ (1997) లా లా లాండ్ (2016) ఉన్నాయి.

సిన్నర్స్ తరువాత 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' 13 నామినేషన్లతో రెండో స్థానంలో ఉండగా, మార్టీ సుప్రీం, ఫ్రాంకెన్‌స్టైయిన్, సెంటిమెంటల్ వాల్యూ 9 నామినేషన్లు దక్కించుకున్నాయి. హామ్నెట్ ఎనిమిది నామినేషన్లు పొందింది.

మార్చి 15న జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి అమెరికా హాస్యనటుడు కోనన్ ఓ బ్రియన్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆస్కార్ నామినేషన్లు, బ్రాడ్ పిట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎఫ్1 చిత్రంలో బ్రాడ్ పిట్ రేసింగ్ డ్రైవర్‌గా నటించారు.

కేటగిరీల వారీగా నామినేషన్ల వివరాలు

ఉత్తమ చిత్రం

  • బుగోనియా
  • ఫ్రాంకెన్‌స్టైయిన్
  • ఎఫ్1
  • హామ్నెట్
  • మార్టీ సుప్రీం
  • వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • ది సీక్రెట్ ఏజెంట్
  • సెంటిమెంటల్ వాల్యూ
  • సిన్నర్స్
  • ట్రైన్ డ్రీమ్స్

ఉత్తమ నటుడు

  • తిమోతీ చలమెట్ - మార్టీ సుప్రీం
  • లియోనార్డో డికాప్రియో - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • ఏతాన్ హాక్ - బ్లూ మూన్
  • మైఖేల్ బి జోర్డాన్ - సిన్నర్స్
  • వాగ్నర్ మౌరా - ది సీక్రెట్ ఏజెంట్

ఉత్తమ నటి

  • జెస్సీ బక్లీ - హామ్నెట్
  • రోజ్ బైర్న్ - ఇఫ్ ఐ హాడ్ లెగ్స్ ఐ'డ్ కిక్ యు
  • కేట్ హడ్సన్ - సాంగ్ సంగ్ బ్లూ
  • రెనేట్ రీన్స్వ్ - సెంటిమెంటల్ వాల్యూ
  • ఎమ్మా స్టోన్ – బుగోనియా
ఆస్కార్ నామినేషన్లు 2026, సిన్నర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిన్నర్స్ తారాగణం వున్మీ మోసాకు, డెల్‌రాయ్ లిండో ఇద్దరూ నామినేషన్లు దక్కించుకున్నారు.

ఉత్తమ సహాయ నటి

  • ఎల్లే ఫానింగ్ - సెంటిమెంటల్ వాల్యూ
  • ఇంగా ఇబ్స్‌డాటర్ లిలియాస్ - సెంటిమెంటల్ వాల్యూ
  • అమీ మాడిగన్ - వెపన్స్
  • వున్మి మొసాకు - సిన్నర్స్
  • టెయానా టేలర్ - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ సహాయ నటుడు

  • బెనిసియో డెల్ టోరో - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • జాకబ్ ఎలోర్డి - ఫ్రాంకెన్‌స్టైయిన్
  • డెల్రాయ్ లిండో - సిన్నర్స్
  • సీన్ పెన్ - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్ - సెంటిమెంటల్ వాల్యూ

ఉత్తమ దర్శకుడు

  • పాల్ థామస్ అండర్సన్ - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • ర్యాన్ కూగ్లర్ - సిన్నర్స్
  • జోష్ సఫ్డీ - మార్టీ సుప్రీం
  • జోచిమ్ ట్రైయర్ - సెంటిమెంటల్ వాల్యూ
  • క్లోయ్ జావో – హామ్నెట్

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే

  • బుగోనియా
  • ఫ్రాంకెన్‌స్టైయిన్
  • హామ్నెట్
  • వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • ట్రైన్ డ్రీమ్స్

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే

  • బ్లూ మూన్
  • ఇట్ వాజ్ జస్ట్ ఎ యాక్సిడెంట్
  • మార్టీ సుప్రీం
  • సెంటిమెంటల్ వాల్యూ
  • సిన్నర్స్
ఆస్కార్ నామినేషన్లు 2026

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తమ దర్శకుడిగా ర్యాన్ కూగ్లర్ నామినేట్ కాగా, ఉత్తమ నటుడిగా మైఖేల్ బి జోర్డాన్ నామినేట్ అయ్యారు.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్

  • డియర్ మీ - డయాన్ వారెన్: రిలెంట్‌లెస్
  • గోల్డెన్ - కె పాప్ డెమోన్ హంటర్స్
  • ఐ లైడ్ టు యు - సిన్నర్స్
  • స్వీట్ డ్రీమ్స్ ఆఫ్ జాయ్ - వివా వెర్డి!
  • ట్రైన్ డ్రీమ్స్ - ట్రైన్ డ్రీమ్స్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్

  • బుగోనియా
  • ఫ్రాంకెన్‌స్టైయిన్
  • హామ్నెట్
  • వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • సిన్నర్స్

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్

  • ఇట్ వజ్ జస్ట్ ఎ యాక్సిడెంట్
  • సెంటిమెంటల్ వాల్యూ
  • సిరాట్
  • ది సీక్రెట్ ఏజెంట్
  • ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్

  • ఆర్కో
  • ఎలియో
  • కెపాప్ డెమన్ హంటర్స్
  • లిటిల్ అమేలీ ఆర్ ది క్యారెక్టర్ ఆఫ్ రెయిన్
  • జూటోపియా 2

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్

  • కమ్ సీ మీ ఇన్ ది గుడ్ లైట్
  • కటింగ్ త్రూ ది రాక్స్
  • మిస్టర్ నోబడీ ఎగైనెస్ట్ పుతిన్
  • ది అలబామా సొల్యూషన్
  • ది పర్ఫెక్ట్ నైబర్

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్

  • అవతార్: ఫైర్ అండ్ యాష్
  • ఫ్రాంకెన్‌స్టైయిన్
  • హామ్నెట్
  • మార్టీ సుప్రీం
  • సిన్నర్స్

బెస్ట్ మేకప్, హెయిర్‌స్టైలింగ్

  • ఫ్రాంకెన్‌స్టైయిన్
  • కొకుహో
  • సిన్నర్స్
  • ది స్మాషింగ్ మెషిన్
  • ది అగ్లీ స్టెప్‌సిస్టర్

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్

  • ఫ్రాంకెన్‌స్టైయిన్
  • హామ్నెట్
  • మార్టీ సుప్రీం
  • వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • సిన్నర్స్

బెస్ట్ సౌండ్

  • ఫ్రాంకెన్‌స్టైయిన్
  • ఎఫ్1
  • వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • సిన్నర్స్
  • సిరాట్

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్

  • ఎఫ్1
  • మార్టీ సుప్రీం
  • వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • సెంటిమెంటల్ వాల్యూ
  • సిన్నర్స్

బెస్ట్ సినిమాటోగ్రఫీ

  • ఫ్రాంకెన్‌స్టైయిన్
  • మార్టీ సుప్రీం
  • వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • సిన్నర్స్
  • ట్రైన్ డ్రీమ్స్

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్

  • అవతార్: ఫైర్ అండ్ యాష్
  • ఎఫ్1
  • జురాసిక్ వరల్డ్ రీబర్త్
  • సిన్నర్స్
  • ది లాస్ట్ బస్

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్

  • ఏ ఫ్రెండ్ ఆఫ్ డోరోతీ
  • బుచర్స్ స్టెయిన్
  • జేన్ ఆస్టెన్ పీరియడ్ డ్రామా
  • ది సింగర్స్
  • టూ పీపుల్ ఎక్స్‌ఛేంజింగ్ సెలైవా

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్

  • బటర్‌ఫ్లై
  • ఫర్‌ఎవర్‌గ్రీన్
  • రిటైర్‌మెంట్ ప్లాన్
  • ది గర్ల్ హూ క్రైడ్ పెర్ల్స్
  • ది త్రీ సిస్టర్స్

బెస్ట్ డాక్యుమెంటరీ లఘు చిత్రం

  • ఆల్ ది ఎంప్టీ రూమ్స్
  • ఆర్మ్‌డ్ ఓన్లీ విత్ ఏ కెమెరా: ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ బ్రెంట్ రెనౌడ్
  • చిల్డ్రన్ నో మోర్: వర్ అండ్ ఆర్ గాన్
  • ది డెవిల్ ఈజ్ బిజీ
  • పర్‌ఫెక్ట్‌లీ ఏ స్ట్రేంజ్‌నెస్

ఉత్తమ తారాగణం

  • హామ్నెట్
  • మార్టీ సుప్రీం
  • వన్ బ్యాటిల్ ఆప్టర్ అనదర్
  • సిన్నర్స్
  • ది సీక్రెట్ ఏజెంట్
ఆస్కార్ నామినేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరియానా గ్రాండే

ఎనిమిది సర్‌ప్రైజ్‌లు

ఆస్కార్ నామినేషన్ల తొలి ప్రకటనతోనే అవార్డుల నిపుణులు ఆశ్చర్యపోయారు.

ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ "ఎల్లే ఫానింగ్, సెంటిమెంటల్ వాల్యూ" అంటూ వ్యాఖ్యతలు డేనియల్ బ్రూక్స్, లూయిస్ పుల్‌మాన్‌ ప్రకటించారు. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ నార్వేజియన్ కుటుంబ చిత్రంలో ఫానింగ్ తన పాత్రకు ప్రశంసలు పొందినప్పటికీ, ఆమె నామినేట్ అవుతుందని కొంతమంది మాత్రమే ఊహించారు.

ఈ మొదటి సర్‌ప్రైజ్ నామినేషన్లలో అనేక ఊహించని ఎంపికలు, కొన్ని తిరస్కరణలు ఉంటాయని చెప్పకనే చెప్పింది. అవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి.

ఇలాంటివి ఎనిమిది ప్రధానమైనవి ఉన్నాయి.

ఆస్కార్ నామినేషన్లు 2026

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాల్ మెస్కల్, చేజ్ ఇన్ఫినిటీ‌లకు నామినేషన్ దక్కలేదు.

1. ప్రముఖ నటులకు దక్కని నామినేషన్

కొంతమంది ప్రముఖ నటులు నామినేట్ అవుతారని చాలామంది భావించారు, కానీ అలా జరగలేదు.

హామ్నెట్ చిత్రానికి పాల్ మెస్కల్‌కు సహాయ నటుడిగా నామినేషన్ దక్కలేదు. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది.

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రంలో నలుగురు పెద్ద నటులు నామినేట్ అయ్యారు కానీ, ఈసారి అవార్డు వస్తుందని చాలామంది భావించిన చేజ్ ఇన్ఫినిటీకి ఉత్తమ నటిగా కనీసం నామినేషన్ దక్కలేదు.

ఇతర నటులు జెస్సీ ప్లెమోన్స్ (బుగోనియా), జోయెల్ ఎడ్జెర్టన్ (ట్రైన్ డ్రీమ్స్)లదీ అదే పరిస్థితి. కానీ, రెండు చిత్రాలు ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్ అయ్యాయి.

2. ఎఫ్1 ఒక కంఫర్ట్ మూవీ

బ్రాడ్ పిట్ రిటైర్డ్ రేసింగ్ డ్రైవర్‌గా నటించిన ఎఫ్1, ఉత్తమ చిత్ర జాబితాలో నామినేషన్ దక్కించుకుని ఆశ్చర్యపరిచింది.

చాలామంది దీనికి సాంకేతిక విభాగంలో అవార్డులు వస్తాయని ఆశించారు, కానీ ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకుని ఆశ్చర్యపరిచింది.

సరదాగా ఉండే సంప్రదాయ, చక్కగా నిర్మించిన సినిమాలను అకాడమీ ఇష్టపడుతుందని ఈ ఎంపిక చూపుతోంది.

3. సిన్నర్స్ కు 16 నామినేషన్లు

సిన్నర్స్ చిత్రం రికార్డు స్థాయిలో 16 నామినేషన్లు పొందింది. ఈ చిత్రం గత వసంతకాలంలో విడుదలైనప్పటికీ చాలామంచి ఆదరణ పొందింది.

సిన్నర్స్ 1930ల నాటి బ్లూస్ సంగీతంతో వాంపైర్ హర్రర్‌ను కలిసిన కళాత్మక చిత్రం.

దర్శకుడు ర్యాన్ కూగ్లర్ 25 ఏళ్ల తర్వాత సినిమా హక్కులు తిరిగి వచ్చేలా వార్నర్ బ్రదర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని పాపులర్ అయ్యారు.

4. వికెడ్ : ఫర్‌గుడ్‌కు ఆశాభంగం

మొదటి వికెడ్ చిత్రం బాగా ఆడింది. కానీ, దాని సీక్వెల్ 'వికెడ్: ఫర్ గుడ్‌'కు నామినేషన్లు దక్కలేదు.

అరియానా గ్రాండే రాసిన కొత్త పాటకు నామినేషన్ వస్తుందని చాలామంది భావించారు, కానీ రాలేదు.

మరో పెద్ద చిత్రం, అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమాకు సాంకేతిక విభాగంలో నామినేషన్లు వచ్చాయి.

జూటోపియా 2, కెపాప్ డెమన్ హంటర్స్ వంటి పాపులర్ సినిమాలు యానిమేటెడ్ విభాగంలో స్థానం దక్కించుకున్నాయి.

5. బ్రిటిష్ నటులు

సిన్నర్స్ సినిమా నుంచి ఇద్దరు బ్రిటిష్ నటులకు నామినేషన్లు దక్కాయి.

ఉన్మి మొసా ఉత్తమ సహాయ నటిగా నామినేట్ అయ్యారు, దీనిని చాలామంది ఊహించారు.

డెల్రాయ్ లిండో ఉత్తమ సహాయ నటుడిగా నామినేట్ అయ్యారు, ఇది ఆశ్చర్యపరిచింది.

ఆస్కార్ నామినేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేట్ హడ్సన్, రోజ్ బైర్నే, ఆమీ మాడిగన్

6. కొన్ని చిత్రాలకు ఒకే నామినేషన్

కొన్ని చిత్రాలకు ఒకే ఒక నామినేషన్ దక్కింది

రోజ్ బైర్న్ తన చిత్రం ‘ఇఫ్ ఐ హాడ్ లెగ్స్ ఐవుడ్ కిక్ యు’ అనే మాతృత్వ ఇతివృత్తం ఉన్న చిత్రానికి నామినేషన్ పొందారు.

అలాగే సంగీతాత్మక ప్రేమక థ సాంగ్ సంగ్ బ్లూ చిత్రానికి కేట్ హడ్సన్ నామినేట్ అయ్యారు.

వెపన్స్ చిత్రంలో నటించిన అమీ మాడిగన్ కూడా నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్ ప్రత్యేకమైనది. ఎందుకంటే సాధారణంగా హర్రర్ సినిమాలు ఆస్కార్ నామినేషన్లకు పెద్దగా అవకాశం దక్కించుకోలేవు. కానీ అమీ మాడిగన్ తన నటన కారణంగా ముందునే ఆమె ఆస్కార్ అవార్డుకు అభిమానులు, విమర్శకుల ఎంపికలో ఉన్నారు.

ఆస్కార్ నామినేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెంటిమెంటల్ వాల్యూ చిత్రానికి కాస్టింగ్ నామినేషన్ దక్కలేదు.కానీ దానిలోని ప్రధాన నటీనటులైన నలుగురూ స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్, ఎల్లే ఫాన్నింగ్, రెనేట్ రీన్స్వే, ఇంగాగా ఇబ్స్‌డాటర్ లిల్లియాస్ వ్యక్తిగత నామినేషన్లు పొందారు.

7. కొత్త కేటగిరీ

కొత్తగా తీసుకొచ్చిన కాస్టింగ్ కేటగిరీలో హామ్నెట్, సిన్నర్స్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ వంటి చిత్రాలు ఉన్నాయి.

ఆశ్చర్యం ఏమిటంటే, సెంటిమెంటల్ వాల్యూ చిత్రానికి కాస్టింగ్ నామినేషన్ దక్కలేదు.కానీ దానిలోని ప్రధాన నటీనటులైన నలుగురూ స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్, ఎల్లే ఫాన్నింగ్, రెనేట్ రీన్స్వే, ఇంగాగా ఇబ్స్‌డాటర్ లిల్లియాస్ వ్యక్తిగత నామినేషన్లు పొందారు.

ఈ నలుగురు నటులు వ్యక్తిగతంగా నామినేషన్ పొందేంత ప్రభావంతంగా ఉన్నారంటే, వారిని ఒకచోట చేర్చిన కాస్టింగ్ డైరెక్టర్లు అయిన అవీ కాఫ్‌మన్,యింగ్విల్ కొల్సెట్ హాగాకు కూడా గుర్తింపు దక్కుతుందని భావించాలి.

ఆస్కార్ నామినేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

8. ఆస్కార్‌కు దగ్గరగా తిమోతీ

తిమోతీ చలమెట్ మార్టీ సుప్రీం ద్వారా తన మొదటి ఆస్కార్ అవార్డును గెలుచుకునే అవకాశం ఉంది.

ఇంతకుముందు ఆయన రెండుసార్లు నామినేట్ అయ్యారు.

అంతేకాదు, ఆయన నటించిన వాటిలో ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలు ఆస్కార్ 'బెస్ట్ ఫిల్మ్' కేటగిరీలో నామినేట్ అయ్యాయి.

30 సంవత్సరాల వయస్సులో, మూడు ఉత్తమ నటుడి నామినేషన్లు పొందిన అతి పిన్న వయస్కులలో తిమోతీ ఒకరు. ఆయన ఈ ఏడాది ఆస్కార్ అవార్డు పొందుతారని చాలామంది భావిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)