30 సంవత్సరాలలో 31 మందిని రేప్ చేశాడు.. పోలీసులు కనిపెట్టే సమయానికి మరణించాడు

ఫొటో సోర్స్, NSW POLICE
- రచయిత, టిఫానీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ
ఆస్ట్రేలియాలోని సిడ్నీని 30 ఏళ్ల పాటు రేప్‌లతో భయపెట్టిన సీరియల్ రేపిస్ట్‌ను అక్కడి పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. నిందితుడు మొట్టమొదటిసారి రేప్‌కు పాల్పడిన 40 ఏళ్ల తరువాత ఆయన్ను పోలీసులు గుర్తించగలిగారు.
‘1985 నుంచి 2001 మధ్య కీత్ సిమ్స్ మొత్తం 31 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధిత మహిళలలో కొందరిపై జాగింగ్‌కు వెళ్తున్నప్పుడు, మరికొందరి ఇళ్లలోకి చొరబడి కీత్ సిమ్స్ అత్యాచారాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
మొదట్లో ఈ కేసులను పరిశోధించిన డిటెక్టివ్‌లు ఈ రేప్‌ల వెనుక ఒకరి కంటే ఎక్కువ మంది ఉండొచ్చని భావించారు.
అయితే, కొత్త రకం డీఎన్ఏ టెక్నాలజీ సహాయంతో ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ రేప్‌లన్నిటికీ కారణం కీత్ సిమ్స్ అని తేలింది.
కాగా కీత్ సిమ్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన 66 ఏళ్ల వయసులో మరణించాడు.
‘బోండీ బీస్ట్’, ‘ట్రాక్‌సూట్ రేపిస్ట్’గా కొన్ని కేసుల్లో పేర్కొన్న కీత్ సిమ్స్ మొట్టమొదట 1985లో క్లోవెల్లీ శివారులోని సముద్రతీరంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసు రికార్డుల ప్రకారం ఆయన చేసిన చివరి రేప్ 2001లో క్లోవెల్లీ సమీపంలోని స్మశానం వద్ద.
వీటిలో ప్రతి కేస్‌ను విడివిడిగా పరిశోధించారు. అయితే, పోలీసులు వాటన్నిటికీ 2000 సంవత్సరంలో లింక్ చేసి పరిశోధన ప్రారంభించారు.
మొత్తం 31 కేసుల్లో 12 కేసుల్లో బాధితుల నుంచి దొరికిన డీఎన్ఏ ఒకటే. మిగతా 19 కేసులలో నేరం జరిగిన తీరు ఒకేలా ఉంది.
రేప్‌కు గురైన బాధితులు 14 నుంచి 55 ఏళ్ల మధ్యవయస్కులు. తమపై అత్యాచారం చేసిన వ్యక్తి ఎలా ఉంటాడన్న ప్రశ్నకు బాధితులంతా దాదాపు ఒకేలా చెప్పారు.
రేప్‌కు పాల్పడిన వ్యక్తి 160 నుంచి 180 సెంటీమీటర్ల ఎత్తు ఉంటాడని.. నల్ల రంగులో ఉంటాడని, కళ్లు గోధుమ రంగులో ఉంటాయని, ముక్కు వెడల్పుగా ఉంటుందని చెప్పారు.
ట్రాక్ సూట్స్, హూడీలు, ఫుట్ బాల్ షార్ట్స్ వంటివి ధరించినట్లు, ముఖం కప్పుకుంటాడని బాధితులు చెప్పారు.
కత్తి చూపించి బెదిరించడం.. లేదంటో తన దగ్గర కత్తి ఉందని చెప్పి బెదిరించి అత్యాచారాలకు పాల్పడినట్లు బాధితుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు తెలిపారు.
ఈ కేసుల దర్యాప్తు సమయంలో 2019లో పోలీసులకు బలమైన ఆధారం దొరికింది. పోలీసుల డాటాబేస్‌లో డీఎన్ఏ మ్యాచ్ కావడంతో అనుమానితుల జాబితా 324 మందికి తగ్గించారు.
ఆ ఏడాది సెప్టెంబరులో కొన్ని కేసులలోని బాధితుల నుంచి సేకరించిన డీఎన్ఏ కీత్ సిమ్స్ డీఎన్ఏకు సరిపోలడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అయితే, సిమ్స్ కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రం ఆయన చాలామంచివారని.. మంచి తండ్రి, మంచి తాత.. అందరితో మంచిగా ఉంటారని చెప్పుకొచ్చారు.
ఈ రేప్‌లతో సిమ్స్‌కు సంబంధం ఉందని గుర్తించిన డిటెక్టివ్.. సిమ్స్ కుటుంబసభ్యులను కలిసినప్పుడు వారు తమకు ఏమీ తెలియదని చెప్పారు.
‘సిమ్స్ భార్యను నేను కలిసి ఈ విషయం చెప్పగానే ఆమె షాక్ తిన్నారు’ అని డిటెక్టివ్ సార్జెంట్ షెల్లీ జాన్ ‘ది డైలీ టెలిగ్రాఫ్’తో చెప్పారు.
తన భర్తే ఇవన్నీ చేశారంటే ఆమె నమ్మలేకపోయారు అని షెల్లీ జాన్ చెప్పారు.
రేపిస్ట్‌ను గుర్తించినట్లు పోలీసులు బాధితులకు కూడా చెప్పారు. అయితే, సిమ్స్ మరణించడంతో చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఇప్పుడు ఆగిపోయాయి.
ఇవి కూడా చదవండి:
- PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: 20 రూపాయలతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందడం ఎలా?
- కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...
- 50 ఏళ్లు ప్రతి రోజూ కొండపైకి వెళ్లిన ఈ 85 ఏళ్ల తాతను అంతా ఎగతాళి చేశారు, ప్రభుత్వం సన్మానం చేసింది
- ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ 2022: స్టేడియంలో బీరు అమ్మకాల గురించి ఫీఫా ఎందుకు పోరాడుతోంది?
- 3డీ ప్రింటింగ్ ద్వారా మనిషి అవయవాల తయారీ.. ఎలా జరుగుతోంది, ఎంతవరకూ వచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








