#CWG2018: మహిళల టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు స్వర్ణం

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో ఆదివారం జరిగిన మహిళల టేబుల్ టెన్నిస్ ఫైనల్స్‌లో భారత జట్టు విజయం సాధించింది.
గత ఛాంపియన్ సింగపూర్‌ను 3-1 తేడాతో ఓడించిన భారత మహిళలు స్వర్ణ పతకం సాధించారు.
మానికా బత్రా భారత్‌కు శుభారంభం అందిస్తూ తైన్వీ ఫెంగ్‌ను 3-2 తేడాతో ఓడించింది. దాంతో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది.
అయితే ఆ తర్వాతి గేమ్‌లో సింగపూర్‌కు చెందిన యూ వెంగ్యూ భారత క్రీడాకారిణి మధురికా పాట్కర్‌ను 3-0 తేడాతో ఓడించింది.
మూడో గేమ్ డబుల్స్ కాగా ఇందులో పాట్కర్‌కు మౌమా దాస్ తోడైంది. వీరిద్దరి జోడీ సింగపూర్‌కు చెందిన జూ యిహాన్, మెంగ్యూ యూల జోడీని 3-1 తేడాతో ఓడించింది.
చివరగా మానికా బత్రా సింగపూర్ క్రీడాకారిణి జూ యిహాన్‌ను 3-0 తేడాతో ఓడించడంతో స్వర్ణం భారత్ వశమైంది.
దీంతో భారత్‌కు దక్కిన బంగారు పతకాల సంఖ్య 7కు చేరింది. రెండు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం పతకాల సంఖ్య 12.
పతకాల జాబితాలో భారత్ ఇప్పటికీ నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది.
అగ్ర స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు 31 స్వర్ణాలు సహా మొత్తం 84 పతకాలు దక్కాయి.
రెండో స్థానంలో ఇంగ్లాండ్, మూడో స్థానంలో కెనడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








