ఇస్రో రాకెట్ ప్రయోగం లైవ్

ఫొటో సోర్స్, AFP
స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సెంచరీ కొట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి వందో శాటిలైట్‌ను ప్రయోగించనుంది.
సరిగ్గా 9.28 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ-40 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఈ ఉపగ్రహాల వల్ల భూమిపై ఒక మీటర్ విస్తీర్ణంలో ఏం జరుగుతుందో 505 కిలోమీటర్ల ఎత్తు నుంచి చూసి తెలుసుకోవచ్చు.




