యుక్రెయిన్ సంక్షోభం: ఐక్యరాజ్య సమితి భద్రతామండలి చర్చలు

ఫొటో సోర్స్, Anadolu Agency/Getty
యుక్రెయిన్ సంక్షోభంపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.30కు న్యూయార్క్‌లో సమావేశం కానుంది.
ప్రపంచం ప్రమాదకరమైన క్షణాన్ని ఎదుర్కుంటోందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మంగళవారం అన్నారు.
"ఇది సంయమనంతో, ఉద్రిక్తతలు తగ్గించాల్సిన సమయం. ఈ ప్రమాదకరమైన పరిస్థితిని మరింత దిగజార్చే ప్రకటనలు, చర్యలకు ఇక్కడ చోటు లేదు" అన్నారు.
తూర్పు యుక్రెయిన్‌లో తక్షణం కాల్పుల విరమణ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, EPA
'మేం వెన్ను చూపం, మీరు మా ముఖాలే చూస్తారు'- జెలెన్స్కీ
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా రష్యాకు హెచ్చరికలు చేశారు.
"వాళ్లు దురాక్రమణకు పాల్పడితే, మా కౌంటీ, మా స్వేచ్ఛను, మా జీవితాలను, మా పిల్లల ప్రాణాలను తీసుకోవాలని ప్రయత్నిస్తే మమ్మల్ని మేం రక్షించుకుంటాం. మీరు దాడి చేస్తుంటే మీకు వెన్ను చూపం, మీరు మా ముఖాలే చూస్తారు" అన్నారు.
యుక్రెయిన్ సరిహద్దుల్లో దాదాపు 200,000 మంది సైనికులను, వేల సంఖ్యలో సైనిక వాహనాలను రష్యా మోహరించిందని జెలెన్స్కీ చెప్పారు.
అర్థరాత్రి టీవీలో ఆయన ప్రసంగించారు. రష్యా పౌరులకు అర్థమయ్యేలా ఆయన రష్యన్ భాషలోనూ మాట్లాడారు.
"మా మాట వినండి. యుక్రెయిన్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. యుక్రెయిన్ ప్రభుత్వం కూడా శాంతిని కోరుకుంటోంది" అని ఆయన అన్నారు.
'యుక్రెయిన్ మీద యుద్ధానికి దిగకుండా మీ అధ్యక్షుడిని ఆపండి' అని రష్యా ప్రజలకు యుక్రెయిన్ అధ్యక్షుడు చేసిన చివరి అభ్యర్థనగా దీనిని చూడొచ్చని బీబీసీ తూర్పు యూరోపియన్ ప్రతినిధి సారా రెయిన్స్‌ఫోర్డ్ చెప్పారు.
రష్యా సైన్యం అడుగు ముందుకు వేసేందుకు మాస్కోలోని నాయకత్వం ఆమోదించిందని, రష్యా తన సైనిక బలగాలను యుక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించడాన్ని ప్రస్తావిస్తూ జెలెన్స్కీ చెప్పారు.
మరో దేశ భూభాగంలోకి వెళ్లడం అంటే, ఈ చర్య ఐరోపా ఖండంలో ఒక పెద్ద యుద్ధానికి నాంది కావచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
తూర్పు యుక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో దాడులు ప్రారంభించాలని తాను ఆదేశాలిచ్చానని రష్యా అధికారులు చేస్తున్న వాదనలను ఆయన తోసిపుచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ సంక్షోభం: కొన్ని దేశాలు అమెరికాతో జత కట్టకుండా, రష్యా పక్షం వహిస్తున్నాయి ఎందుకు?
- రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: భారత వైఖరిపై ఇంత చర్చ ఎందుకు
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
- బ్రిటన్ను భయపెట్టిన భారత మేజిక్ మహారాజు
- యుక్రెయిన్ సంక్షోభ సమయంలో ఇమ్రాన్‌ఖాన్ రష్యా ఎందుకు వెళ్లారు, భారత్‌పై చూపే ప్రభావమేమిటి?
- కర్ణాటక: బజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు.. పోలీసులు ఏం చెబుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










