ఒమిక్రాన్: సాధారణ జలుబు కోవిడ్ నుంచి కాపాడుతుందా
జలుబు నుంచి కాపాడేందుకు శరీరంలో ఏర్పడే సహజమైన రక్షణ కణాలు కోవిడ్ 19 నుంచి కూడా కొంత రక్షణ ఇస్తాయని ఒక అధ్యయనం చెబుతోంది.
ఈ అధ్యయనం ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్‌లో ప్రచురితమైంది. ఇందులో కోవిడ్ 19 సోకిన వారితో గడిపిన 52 మంది పాల్గొన్నారు.
జలుబు చేసిన తర్వాత కొన్నాళ్లపాటు మళ్లీ జలుబు రాకుండా కాపాడేందుకు శరీరంలో తయారైన రోగ నిరోధక కణాలు "మెమరీ బ్యాంక్ లో నిక్షిప్తమై ఉంటాయి. అలా రోగ నిరోధక కణాలున్న వారిలో కోవిడ్ సోకే అవకాశం తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
అయితే, ఈ ఒక్క విషయం ఆధారంగా ఎవరూ కోవిడ్‌ను తేలికగా తీసుకోరాదని నిపుణులు అంటున్నారు. కోవిడ్ నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సీన్లు తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.
కానీ, శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడే విధానం గురించి తెలుసుకునేందుకు ఈ అధ్యయన ఫలితాలు కొంతవరకు పనికొస్తాయని భావిస్తున్నారు.
కోవిడ్ 19 కరోనావైరస్ వల్ల వస్తుంది. ఇతర రకాల కరోనా వైరస్‌ల వల్ల కూడా మరి కొన్ని రకాలైన జలుబులు వస్తాయి. ఒక రోగానికి చేకూరిన రోగ నిరోధక శక్తి మరొక రోగం నుంచి కూడా కాపాడుతుందో లేదోనని శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు.
జలుబు చేసి తగ్గిన వారందరికీ, కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందని అనుకోవడం చాలా పెద్ద తప్పు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబులన్నీ కరోనా వైరస్ వల్ల ఏర్పడేవి కావని అంటున్నారు.
వైరస్ సోకిన తర్వాత కూడా కొంత మందికి కోవిడ్ వస్తుంటే మరి కొందరికి ఎందుకు రావడం లేదనే విషయం గురించి మరింత అర్థం చేసుకోవాలని లండన్ ఇంపీరియల్ కాలేజీ నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
- జలుబు తగ్గడానికి ఏం చేయాలి? అస్సలు చేయకూడని పనులేంటి?
- బుల్లీబాయి, సుల్లీ డీల్స్: సోషల్ మీడియాలో ముస్లిం మహిళల వేలం గురించి మనం అర్ధం చేసుకోవాల్సిందేంటి?
- మొబైల్ ఫోన్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఏడు విషయాలు
- జేమ్స్ బాండ్: డేనియల్ క్రెయిగ్ స్థానంలో వచ్చే కొత్త హీరో ఎవరు?
- కృతి శెట్టి: ‘శృంగారం కూడా నటనే కదా.. అలా ఉంటే బాగుంటుందని నేనే దర్శకుడికి చెప్పా’
- ‘శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- 'సావిత్రికి అభిమానిని.. ఆ తర్వాతే అల్లుడిని!'
- నటుడు విజయ్ సేతుపతిపై రూ.3 కోట్ల పరువు నష్టం దావా.. బెంగళూరు విమానాశ్రయం దాడిలో ఏం జరిగింది?
- మైక్ టైసన్: విజయ్ దేవరకొండ 'లైగర్'లో ఈ బాక్సింగ్ హీరో ఏం చేస్తున్నాడు?
- ప్రేమ, విరహం, భక్తి, రక్తి, విప్లవం, వినోదం అన్నీ తెలిసిన కలం
- కరుణ కుమార్: పలాస, శ్రీదేవి సోడా సెంటర్ల నుంచి మెట్రో కథల వరకు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)