కరోనావైరస్: డెల్టా, ఒమిక్రాన్‌ల మధ్య తేడా ఏమిటి? ఏ వేరియంట్ ప్రమాదకరం

వీడియో క్యాప్షన్, డెల్టా, ఒమిక్రాన్‌ల మధ్య తేడా ఏమిటి?

ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారో లేదో తెలుసుకునేందుకు పాలీమరేస్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ముక్కు, గొంతుల్లో వైరస్ నమూనాలను సేకరించిన స్వాబ్‌లను ల్యాబ్‌లకు పంపిస్తారు. ల్యాబ్‌లలో ఈ నమూనాలను విశ్లేషిస్తారు.

నమూనాలను విశ్లేషించే ల్యాబ్ సామర్థ్యం ఆధారంగా వేరియంట్ల గుర్తింపు జరుగుతుంది. డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లను గుర్తించడంలో కొన్ని ల్యాబ్‌లు సహాయపడతాయి.

కొన్ని ల్యాబ్‌లు మాత్రమే ఈ వేరియంట్లను గుర్తించేందుకు కావాల్సిన సాంకేతికతను కలిగి ఉన్నాయి.

పీసీఆర్ పరీక్షలను ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా అమెరికా చేస్తుంది. అమెరికా తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్, రష్యా, జర్మనీ, ఇటలీ, దక్షిణ కొరియా అత్యధికంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి.

భారత్‌లో ల్యాబ్‌లకు పంపిస్తోన్న మొత్తం నమూనాల్లో కేవలం ఒక శాతం శాంపుల్స్‌ను మాత్రమే డెల్టా లేదా ఒమిక్రాన్ వేరియంట్‌లను గుర్తించడానికి ఉపయోగిస్తారు.

ఒమిక్రాన్ వేరియంట్ గురించి పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)