ఒమిక్రాన్: కోవిడ్-19 కొత్త వేరియంట్‌ను వ్యాక్సీన్లు ఎదుర్కోగలవా? మళ్లీ లాక్‌డౌన్ తప్పదా?
కరోనావైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్ కట్టడి చేసేందుకు విదేశీ ప్రయాణికులపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.
దక్షిణాఫ్రికాలో కనుగొన్న ఈ వేరియంట్ త్వరగా వ్యాపిస్తోందని, కరోనా వేరియంట్లు అన్నింటిలోనూ ఇదే భయంకరమైనదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఆల్ఫా, డెల్టా వేరియంట్‌ల వంటి గ్రీకు కోడ్-నేమ్‌ల నమూనాను అనుసరించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్‌కు ఓమిక్రాన్ అని పేరు పెట్టింది.
వ్యాక్సీన్లు ఈ కొత్త వేరియంట్‌ను ఎదుర్కోగలవా?
ఆందోళన ఏంటంటే ఈ వైరస్ ఇప్పుడు చైనాలోని వుహాన్‌లో ఉద్భవించిన అసలు వైరస్‌కి పూర్తిగా భిన్నంగా ఉంది. అంటే ఒరిజినల్ స్ట్రెయిన్‌ని ఉపయోగించి రూపొందించబడిన వ్యాక్సీన్‌లు అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు.
అయితే, ఇప్పుడే ప్రయోగశాలల్లో శాస్త్రీయ అధ్యయనాలపై ఆధారపడి ఏమీ చెప్పలేం. ఎందుకంటే వాస్తవ ప్రపంచంలో కరోనావైరస్ తీరు వేరుగా ఉంటోంది. కాబట్టి, దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా మాత్రమే ఒక నిర్థరణకు రాగలం.
ఎందుకంటే.. గతంలో కూడా బీటా వేరియంట్ అత్యంత భయంకరమైనదని శాస్త్రవేత్తలు భావించారు. కానీ, తర్వాత దాని ప్రభావం భయపడినంతగా లేదు.
ఇవి కూడా చదవండి:
- ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? దీనిని భారత ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?
- ఆకాశ హర్మ్యాలకు ఇక కాలం చెల్లిందా, ఇది కూడా కోవిడ్ ఎఫెక్టేనా?
- ‘కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన తండ్రిని చంపేసిన నలుగురు టీనేజీ కుర్రాళ్లు’
- చెక్క, గడ్డి, గంజాయితో 1941లోనే కారు తయారీ.. దీన్ని ఫోర్డ్ సంస్థ ఎందుకు ధ్వంసం చేసింది?
- లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది, భాగస్వాముల్ని మోసం చేస్తున్నాయి, ఇతర పక్షులతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి
- క్రిప్టోకరెన్సీలో 70 లక్షలు నష్టపోయి ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు...’
- కొందరు వందేళ్లకు పైగా జీవించడానికి కారణమేంటి... ఏమిటీ మిస్టరీ?
- రూ. 7 కోట్ల లాటరీ తగిలితే ఇన్ని కష్టాలా?
- బీజింగ్ ఎయిర్పోర్ట్ ఫొటోను నోయిడా ఎయిర్పోర్ట్ అంటూ కేంద్ర మంత్రులు ఎందుకు పోస్ట్ చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)