కువైట్‌: మనుషులు బతకలేనంతగా వేడెక్కిపోతున్న దేశం ఇది

వీడియో క్యాప్షన్, మనుషులు బతకలేనంతగా వేడెక్కిపోతున్న దేశం ఇది

వాతావరణ మార్పు వల్ల తమ రోజు వారీ జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని కువైట్ ప్రజలు వాపోతున్నారు.

ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కువైట్‌లో నమోదైంది. అక్కడ జూలై నెలలో 53.5 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత పెరిగిపోయింది.

పశ్చిమాసియా ఈ స్థాయిలో వేడెక్కుతుండటంతో పరిస్థితులు మరింత విషమించవచ్చు.

కువైట్ ఎప్పుడూ వేడిగా ఉంటుంది. కానీ ఇంత వేడిగా ఎన్నడూ లేదు. ఇక్కడ 50 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రతలు ఇప్పుడు మామూలుగా మారిపోతున్నాయి. ఇది నిత్య పోరాటంగా మారిందని ఇన్‌ఫ్లుయెన్సర్ ఆసియా అల్-షమ్మిరి చెప్తున్నారు.

కువైట్ మహిళ అల్-షమ్మిరి
ఫొటో క్యాప్షన్, అల్-షమ్మిరి

కువైట్ ఆర్థిక వ్యవస్థ శిలాజ ఇంధనాల మీద ఆధారపడి ఉంటుంది.

ప్రపంచంలో తలసరి కర్బన ఉద్గారాల విడుదలలో కువైట్ రెండో అతి పెద్ద దేశం.

ఇక ఆ దేశ ఎగుమతుల్లో దాదాపు 90 శాతం హైడ్రోకార్బనే.

ఈ దేశంలో దశాబ్దాలుగా వాతావరణ వార్తలు అందిస్తున్న ఎస్సా రమదాన్ ప్రతి ఒక్కరికీ సుపరిచితం. ఇటీవలి సంవత్సరాల్లో పరిస్థితి చాలా మారిపోయిందని ఆయన చెప్తున్నారు.

కువైట్ అంతకంతకూ మరింత ఎడారిగా మారుతోంది. నీడ లేకపోవటంతో.. ఈ దేశం విపరీతంగా వేడెక్కే విషవలయంలోకి వెళ్లిపోతోంది.

దీనిపై పోరాటానికి ఓ కువైటీ మహిళ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఓం నయీఫ్ 2015 నుంచి చెట్లు నాటుతున్నారు.

ఉత్తరం నుంచి వేడి గాలులు కువైట్‌ నగరాలను తాకకుండా ఆపటానికి మరిన్ని చెట్లు నాటటం అవసరమని ఓం నయీఫ్, ఎస్సాలు ఇద్దరూ నమ్ముతున్నారు.

కానీ అది కూడా సరిపోకపోవచ్చు. వేడిని తట్టుకోవటానికి ఇక్కడి జనం మరింత ఎక్కువగా ఎయిర్ కండిషనింగ్ వాడుతున్నారు.

ప్రపంచ సగటుతో పోలిస్తే.. పశ్చిమాసియా రెండింతలు ఎక్కువగా వేడెక్కుతోంది.

2050 నాటికి.. పారిశ్రామికీకరణ ముందటి స్థాయికన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని కొందరు నిపుణులు చెప్తున్నారు.

ఇప్పుడుగనక సమూల మార్పులు చేయకపోతే.. ఈ దేశం జనం మనుగడ సాగించలేనంత వేడెక్కిపోతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)