పాలస్తీనా ఎడారి కోటలో ‘ప్రపంచంలోనే అతి పెద్ద చలువ రాతి చిత్తరువు’

వెస్ట్‌బ్యాంక్‌లోని జెరిచో నగరంలో ఉన్న హిషామ్స్ ప్యాలస్‌లో ఇది ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లోర్ మొజాయిక్‌లలో ఇది ఒకటని చెబుతున్నారు. 1.2 కోట్ల డాలర్లు(సుమారు రూ. 90 కోట్లు) వెచ్చించి ఈ పురాతన మొజాయిక్‌ను పునరుద్ధరించారు. దీని పునరుద్ధరణకు అయిదేళ్లు పట్టింది.

వెస్ట్‌బ్యాంక్‌లోని జెరిచో నగరంలో ఉన్న హిషామ్స్ ప్యాలస్‌లో ఫ్లోర్ మొజాయిక్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అతిపెద్ద ఫ్లోర్ మొజాయిక్‌‌ను పాలస్తీనా అధికారులు ఆవిష్కరించారు. వెస్ట్‌బ్యాంక్‌లోని జెరిచో నగరంలో ఉన్న హిషామ్స్ ప్యాలస్‌లో ఇది ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లోర్ మొజాయిక్‌లలో ఇది ఒకటని చెబుతున్నారు. 1.2 కోట్ల డాలర్లు(సుమారు రూ. 90 కోట్లు) వెచ్చించి ఈ పురాతన మొజాయిక్‌ను పునరుద్ధరించారు. దీని పునరుద్ధరణకు అయిదేళ్లు పట్టింది.
వెయ్యేళ్ల కిందటి ఈ మొజాయిక్‌ను 19వ శతాబ్దంలో గుర్తించారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, వెయ్యేళ్ల కిందటి ఈ మొజాయిక్‌ను 19వ శతాబ్దంలో గుర్తించారు. 2016లో జపాన్ ఆర్థిక సహకారంతో పునరుద్ధరణ చర్యలు ప్రారంభించే వరకు ఈ కళాకృతి నిర్లక్ష్యానికి గురైంది. ఈ మొజాయిక్ పునరుద్ధరణతో టూరిజం అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
డెడ్ సీ సమీపంలో ఉన్న హిషామ్స్ ప్యాలస్ 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఈ మొజాయిక్ ప్యానల్ పరిమాణం సుమారు 835 చదరపు మీటర్లు. ఇందులో సుమారు 50 లక్షల మొజాయిక్ ముక్కలు, రాళ్లు ఉన్నాయి. ఈ చలువరాతి చిత్తరువు పర్యాటక ఆకర్షణగా మారుతుందని పాలస్తీనా అధికారులు ఆశిస్తున్నారు.
డెడ్ సీ సమీపంలో ఉన్న హిషామ్స్ ప్యాలస్ 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, డెడ్ సీ సమీపంలో ఉన్న హిషామ్స్ ప్యాలస్ 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. క్రీస్తు శకం 660 నుంచి 750 వరకు పాలనలో ఉన్న ఉమ్మయాద్ వంశం హిషామ్స్ ప్యాలస్‌ను నిర్మించింది. ఇది ఒక ఎడారి కోట.