పేలిన న్యీరగాంగో అగ్నిపర్వతం: వరదలా లావా ఇళ్లలోకి దూసుకొచ్చింది.. రోడ్లు కరిగిపోయాయి

వీడియో క్యాప్షన్, పేలిన న్యీరగాంగో అగ్నిపర్వతం: వరదలా లావా ఇళ్లలోకి దూసుకొచ్చింది.. రోడ్లు కరిగిపోయాయి

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మౌంట్ న్యీరగాంగో అగ్నిపర్వతం పేలింది. దానికి పక్కనే ఉన్న గోమా నగరానికి ముప్పు ముంచుకొచ్చింది.

శనివారం ఈ అగ్నిపర్వతం పేలింది. దాంతో రువాండా సరిహద్దుల్లో ఉన్న గోమా నగరాన్ని ఖాళీ చేయాలని కాంగో ప్రభుత్వం ఆదేశించింది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అగ్నిపర్వతం నుంచి ఎగసిన పొగలు గోమా నగరాన్ని కమ్మేశాయి.

గోమాలో మొత్తం 20 లక్షల జనాభా ఉంది.

లావా నగరంలో చాలా ప్రాంతాల్లో రోడ్ల పైకి చేరింది.

ఇళ్లలోకి వచ్చింది. కొంతమంది లావా మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు.

ఈ అగ్నిపర్వతం విరుంగా నేషనల్ పార్క్‌లో ఉంది.

పరిస్థితి అదుపు తప్పుతోందని అధికారులు చెబుతున్నారు.

దేశంలో పవర్ గ్రిడ్ బ్లాకవుట్ సమస్య ఎదుర్కొంటోంది.

గోమాను, బేనీ నగరంతో కలిపే ఒక హైవే లావాతో కరిగిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)