మనిషి రక్తపు చుక్కతో కూడిన షూలను విడుదల చేసిన సంస్థపై నైకీ కేసు

ఫొటో సోర్స్, MSCHF
అమెరికాలోని ఆర్ట్ కలెక్టివ్ సంస్థ ఎంఎస్‌సీహెచ్ఎఫ్ మనిషి రక్తపు చుక్కతో కూడిన షూలను మార్కెట్ లోకి విడుదల చేయడం పట్ల ప్రముఖ షూ సంస్థ నైకీ కేసు వేసింది.
1,018 డాలర్ల విలువ చేసే ఈ షూలపై తిరగబడిన శిలువ చిహ్నం, అయిదు కోణాలు ఉన్న నక్షత్రం గుర్తు, "ల్యూక్ 10:18" లాంటి పదాలను ముద్రించారు. నైకీ ఎయిర్ మాక్స్ 97 మోడల్ షూకు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ షూని డిజైన్ చేశారు.
అమెరికన్ సింగర్ లిల్ నాస్ ఎక్స్ సౌజన్యంతో ఎంఎస్‌సీహెచ్ఎఫ్ సోమవారం 666 జతల షూలను మార్కెట్లోకి విడుదల చేసింది. అవన్నీ ఒక్క నిమిషంలోనే అమ్ముడైపోయినట్లు తెలిపింది.
అయితే, నైకీ మాత్రం తమ ట్రేడ్ మార్కుని వారు చోరీ చేశారని అంటోంది.
లిల్ నాస్ ఎక్స్ యూట్యూబులో కొత్తగా విడుదల చేసిన పాటతో పాటు ఎరుపు, నలుపు రంగులతో కూడిన ఈ కొత్త షూలను ఎంఎస్‌సీహెచ్ఎఫ్ మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ మ్యూజిక్ వీడియోలో గాయకుడు ఈ షూలను ధరించి 'స్వర్గం' నుంచి 'నరకానికి' ఒక స్తంభం మీద నుంచి జారుతున్నట్లు కనిపిస్తారు.
ఈ షూలపై ఉన్న ఊహాత్మక చిత్రాలు, బైబిల్ లో ఉండే ల్యూక్ 10:18 సూక్తులను చూస్తుంటే "సాతాను మెరుపులా స్వర్గం నుంచి కిందకు వస్తున్నట్లు కనిపించింది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, MSCHF
ప్రతీ షూలో నైకీ ఎయిర్ బబుల్ కుషనింగ్ సోల్, 60 క్యూబిక్ సెంటీమీటర్ల ఎరుపు రంగు సిరా, ఆర్ట్ కలెక్టివ్ సభ్యులు దానం చేసిన ఒక చుక్క రక్తం ఉంటాయి.
ఈ షూలను తమ సంస్థ ఆమోదించదని చెబుతూ అమెరికాలోని న్యూ యార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో నైకీ కేసు నమోదు చేసింది.
ఎంఎస్‌సీహెచ్ఎఫ్ సంస్థ ఈ షూ అమ్మకాలను నిలిపివేయడంతో పాటు తమ స్వుష్ డిజైన్ మార్కును కూడా వాడడం ఆపాలని ఆదేశించాలని నైకీ కోర్టును కోరింది.
"ఆమోదయోగ్యం కాని సాతాను షూలు మార్కెట్లో అయోమయం సృష్టించి తమ సంస్థకు వారితో ఒక తప్పుడు సంబంధం ఉందనే అభిప్రాయాన్ని కలుగచేస్తాయని నైకీ పేర్కొంది.
"ఈ షూలను నైకీ ఆమోదించిందనే తప్పుడు అభిప్రాయంతో నైకీ సంస్థ ఉత్పత్తులను బహిష్కరించాలని కోరుతూ ఇప్పటికే చాలా మంది పిలుపునివ్వడంతో ఇప్పటికే మార్కెట్లో చాలా అయోమయం నెలకొందని చెప్పడానికి ఇదే ఆధారం" అని నైకీ లా సూట్ లో పేర్కొంది.
షూ ఇన్ఫ్లుయన్సర్ సెయింట్ గత శుక్రవారం కొత్త షూల గురించి ట్వీట్ చేసి సోషల్ మీడియాలో, అమెరికా మీడియాలో దీనికి మరింత ప్రచారం కల్పించారని నైకీ పేర్కొంది.
ఈ వివాదాస్పదమైన షూ డిజైన్ గురించి కొంత మంది మతవాదులు, సంప్రదాయవాదులు ట్విటర్ లో సంస్థను, లిల్ నాస్ ని కూడా విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అయితే, విమర్శలు చేసినవారికి, నైకీ కేసుకు వ్యతిరేకంగా లిల్ నాస్ తన ట్వీట్ ద్వారా, మీమ్స్ ద్వారా స్పందించారు.
ఇవి కూడా చదవండి:
- సూయజ్ కాలువలో భారీ నౌక ఇరుక్కుపోవడంతో రోజుకు దాదాపు 70వేల కోట్ల నష్టం.. దాన్ని ఎలా బయటకు తీస్తారు
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- ఇందిరా గాంధీని ఫిరోజ్ మోసం చేశారా... వారి మధ్య గొడవలకు కారణాలేంటి?
- పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- కశ్మీర్: ఎల్వోసీ వద్ద ‘ఆజాది మార్చ్’ను అడ్డుకున్న పాకిస్తాన్ సైన్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








