సూయజ్ కాలువలో ట్రాఫిక్ జామ్ శాటిలైట్ ఫొటోలు: ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోవడంతో నిలిచిపోయిన దాదాపు 300 ఓడలు

సూయజ్ కాలువ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈ ఫొటోలో ఎడమవైపు పైభాగంలో ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోయి ఉండడం మీరు చూడొచ్చు. ఇక కుడివైపున నీటిలో చాలా ఓడలు నిలిచిపోయి ఉండటం కూడా మీరు గమనించొచ్చు.

పైన ఫొటో చూశారా..

చిన్న చిన్నగా కనిపిస్తున్నవన్నీ సూయజ్‌ కాలువ సమీపంలో నిలిచిపోయిన సరుకు రవాణా ఓడలు.

ఇలాంటి నౌకలు అక్కడ దాదాపు 300 వరకు ఉన్నాయి.

రోడ్డుపై ట్రాఫిక్ జామైనట్లే.. అక్కడ నీళ్లపై నౌకలు, ఓడలు జామయ్యాయి.

గత మంగళవారం ఎవర్ గివెన్ అనే భారీ నౌక సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోడమే దీనికి కారణం.

దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ అవి ఇప్పటి వరకు ఫలించలేదు.

ఈ నౌక అడ్డంగా ఉండటంతో సూయజ్ కాలువలో రాకపోకలు స్తంభించాయి.

దీనివల్ల రోజుకు 70వేల కోట్ల రూపాయల వరకు నష్టం జరుగుతోందని అంచనా వేస్తున్నారు.

సూయజ్ కాలువ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 400 మీటర్ల పొడవున్న ఎవర్ గివెన్ నౌక 200 మీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది.
సూయజ్ కాలువ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎవర్ గివెన్‌ నౌకను దారికి తేవడానికి దాదాపు 14 టగ్‌ బోట్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. నౌక చుట్టూ మట్టి తవ్వుతున్నారు. అవసరమైతే ఓడలో ఉన్న సరుకులను కూడా కిందికి దించాలని భావిస్తున్నారు.

ఆరు రోజులుగా ప్రయత్నిస్తూ ఇప్పటి వరకు రెండు వైపులా 30 డిగ్రీల మేర మాత్రమే ఓడను కదిలించగలిగారు.

బలమైన గాలులు, అలల కారణంగా ఈ ఓడను కదిలించే పనులకు పదే పదే అంతరాయం కలుగుతోంది.

సూయజ్ కాలువ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎడమవైపు ఉన్న ఫొటో ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోక ముందు ఆదివారం మార్చి 21న సూయజ్ కాలువ నుంచి వెళ్లడానికి ఎదురుచూస్తున్న ఓడలు. ఇక కుడివైపు ఉన్న ఫొటో ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోయిన రెండు రోజుల తర్వాత మార్చి 25న తీసింది. కుడివైపు ఫొటోలో నౌకల సంఖ్య పెరగడం మనం గుర్తించొచ్చు.

కొన్ని ఓడలు దక్షిణాఫ్రికా మీదుగా వెళ్లాలని భావిస్తున్నాయి.

అయితే, ఆ మార్గంలో వెళ్తే అదనంగా 12 రోజుల సమయం పడుతుంది.

ఇక్కడ వేచి ఉండటం కంటే అలా వెళ్లడం మంచిదని కొందరు భావిస్తున్నారు.

ఎవర్ గివెన్‌ నౌక 400 మీటర్ల పొడవు ఉంటుంది.

కానీ సూయజ్ కాలువ మాత్రం 200 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది.

దాంతో ఈ నౌక కాలువలో అడ్డంగా చిక్కుకుపోయింది. ఈ మార్గంలో రవాణా నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)