పాకిస్తాన్: కరాచీలో దీపావళి వేడుకలు

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్: కరాచీలో దీపావళి వేడుకలు

పాకిస్తాన్‌లోని కరాచీలో సోల్జర్ బజార్ ప్రాంతంలో ఉన్న శ్రీ పంచముఖి హనుమాన్ మందిరాన్ని దీపావళి సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ఇక్కడి హిందువులు దీపావళిని ఐదు రోజులపాటు జరుపుకొంటారు. ఇళ్లను చక్కగా అలంకరిస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. శ్లోకాలు చదువుతారు, దేవుళ్ళను పూజిస్తారు.

కానీ, మిగతా మతపరమైన వేడకల మాదిరిగానే, దీపావళిపైనా కరోనా ప్రభావం ఉంది. కోవిడ్‌ అంతం కావాలని ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

దీపావళి సందర్భంగా శాంతిభద్రతలను కాపాడేందుకు కరాచీలోని ఆలయాల వద్ద భద్రతను పెంచారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)