అమెరికా ఎన్నికల ఫలితాలు: ఆరిజోనాలో ముందంజలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిరాల్ తిపిర్నేని ఎవరు? ఇండియన్ అమెరికన్లు ఎవరెవరు గెలిచారు

ప్రమీలా జయపాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రమీలా జయపాల్

అమెరికా కాంగ్రెస్‌కు ఈ సారి పది మంది భారతీయ-అమెరికన్లు పోటీచేశారు. వీరిలో నలుగురు విజయం సాధించారు. నలుగురు ఓటమి పాలయ్యారు. మరో ఇద్దరి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.

విజయం సాధించిన వారిలో డెమొక్రటిక్ పార్టీ సభ్యులైన ప్రమీలా జయపాల్, ఆర్‌వో ఖన్నా, డా.అమీ బెరా, రాజా కృష్ణ మూర్తి ఉన్నారు. వీరంతా మరోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

వీరితోపాటు శ్రీ ప్రెస్టన్ కుల్‌కర్ణి, హిరాల్ తిపిర్నేని కూడా డెమొక్రటిక్ పార్టీ తరఫు నుంచి పోటీ చేశారు. రిపబ్లికన్ పార్టీ నుంచి మంగ అనంతాత్ముల, నిషా శర్మ బరిలోకి దిగారు. డెమొక్రాట్ సారా గిడియన్, రిపబ్లికన్ రిక్ మెహ్తా సేనేట్‌కు పోటీచేశారు. వీరిలో హిరాల్, సారాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. మిగతా నలుగురూ ఓడిపోయారు.

అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన భారతీయ-అమెరికన్లను సమోసా కాకస్‌గా పిలుస్తుంటారు.

ప్రమీలా జయపాల్

అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌ ప్రమీలనే. వాషింగ్టన్‌లోని ఏడో డిస్ట్రిక్ట్‌ నుంచి తిరుగులేని మెజారిటీతో ఆమె మరోసారి గెలిచారు. రిపబ్లికన్ అభ్యర్థి క్రైగ్ కెల్లర్‌పై ఆమె 2,82,601 ఓట్ల తేడాతో గెలిచారు.

ఆర్‌వో ఖన్నా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్‌వో ఖన్నా

ఆర్‌వో ఖన్నా

ఆర్‌వో ఖన్నా.. విద్యావేత్త, న్యాయవాదిగా సుపరిచితుడు. కాలిఫోర్నియాలోని ఏడో డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమొక్రటిక్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆయన రిపబ్లికన్ అభ్యర్థిపై 48.2 శాతం తేడాతో గెలిచారు.

అమీ బెరా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమీ బెరా

అమీ బెరా

అమ్రీష్ బాబూలాల్ అమీ బెరా వైద్యుడు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఆయన కాలిఫోర్నియా ఏడో డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి బజ్ పీటర్సన్‌పై 22 శాతం తేడాతో ఆయన గెలుపొందారు.

రాజా కృష్ణమూర్తి

ఫొటో సోర్స్, Getty Images

రాజా కృష్ణమూర్తి

సుబ్రమణ్యన్ రాజా కృష్ణ మూర్తి ఇల్లినాయిస్ ఎనిమిదో డిస్ట్రిక్ట్ నుంచి గెలుపొందారు. లిబర్టేరియన్ పార్టీ అభ్యర్థి ప్రెస్టన్ నెల్సన్‌పై 42.2 శాతం ఓట్ల తేడాతో ఆయన గెలిచారు.

సారా గిడియన్

మెయిన్‌లో రిపబ్లికన్ సెనేటర్ సూజన్ కోలిన్స్‌తో డెమొక్రాట్ సారా గిడియన్ తలపడుతున్నారు. ఇక్కడి ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. బుధవారం ఉదయం నాటికి 5.7 శాతం ఓట్లతో సారా కంటే కోలిన్స్ ముందున్నారు. ఇప్పటివరకు 66 శాతం ఓట్లు మాత్రమే లెక్కించారు.

హిరాల్ త్రిపురనేని

ఫొటో సోర్స్, Twitter/hiral tripirneni

హిరాల్ తిపిర్నేని

అరిజోనాలోని ఆరో డిస్ట్రిక్ట్ నుంచి హిరాల్ బరిలోకి దిగారు. రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ స్కెవీకెర్ట్‌పై హిరాల్ 0.6 శాతం తేడాతో ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు 80 శాతం ఓట్లు మాత్రమే లెక్కించారు.

హిరాల్ కుటుంబం ఆమె చిన్నప్పుడే ముంబయి నుంచి అమెరికా వచ్చేశారు. హిరాల్ డాక్టర్ కిశోర్ తిపిర్నేనిని వివాహం చేసుకున్నారు.

మాజీ దౌత్యవేత్త ప్రిస్టెన్ కుల్‌కర్ణి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగ అనంతాత్ములతోపాటు రిపబ్లికన్ అభ్యర్థులు నిషా శర్మ, రిక్ మెహ్తా ఓటమి పాలయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)