భారీ జలాశయాలు భూమిని, మానవ జీవితాన్ని ఎలా మార్చేశాయంటే..

    • రచయిత, రిచర్డ్ ఫిషర్, జేవియర్ హిర్క్‌ఫీల్డ్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

కొన్ని మానవ కట్టడాలు భూమిని సమూలంగా మార్చివేయగలవు. వాటిలో డ్యాంలు ప్రధానమైనవి. ఇవి భూమి నైసర్గిక స్వరూపాన్ని ఊహంచని రీతిలో మార్చేస్తాయి.

నదుల్లో నీటిని నిలువరించేందుకు వీటిని నిర్మిస్తారు. గురుత్వాకర్షణ శక్తిని ఆసరాగా చేసుకొని పర్వత ప్రాంతం నుంచి దిగువకు ప్రవహించే నీటిని ఇవి అడ్డుకుంటాయి. లోతట్టు ప్రాంతాన్ని ముంచివేయడంతోపాటు ఇవి చాలా మార్పులకు కారణం అవుతాయి. ఇవి నది సహజ గమనాన్ని మారుస్తాయి. మరోవైపు నది గుండా ప్రవహించే అవక్షేపాలు కూడా కృత్రిమంగా నిర్మించే డ్యాం దగ్గర నిలిచిపోతాయి. దిగువ ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని ఇవి తగ్గించేస్తాయి.

సన్నంగా పొడవుగా కనిపించే గోడలు, దృఢమైన పునాదులు ఇలా చెప్పుకుంటూ పోతే వీటి నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. వీటిలో కొన్ని అయితే వేల ఏళ్లపాటు అలానే చెక్కుచెదరకుండా ఉండిపోతాయి.

మరోవైపు పరిసరాల్లో నివసించే వారితోపాటు వారి భవిష్యత్ తరాల తలరాతలనూ డ్యాంలు మార్చేస్తాయి. ముఖ్యంగా ఎక్కడో సుదూర ప్రాంతంలో నుండే ప్రభుత్వం ఇక్కడి నదిపై ఆనకట్ట నిర్మించాలని భావించినప్పుడు.. ఇక్కడి ఇళ్లు, పంట పొలాలు నది విధ్వంసానికి బలవుతుంటాయి.

ఉదాహరణకు ఈ ఏడాది మొదట్లో అందరూ కోవిడ్-19 గురించి ఆందోళన చెందేటప్పుడు.. టర్కీలోని ఓ పురాతన నగరం రిజర్వాయర్‌లో పెరుగుతున్న నీటి మట్టానికి మునిగిపోయింది. భవిష్యత్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు బహుశా ఇలా ముంపునకు గురయ్యే ప్రాంతాలపై అధ్యయనం చేపడతారేమో. రాజకీయాల కోసం, విద్యుత్ శక్తి కోసం ఎందుకు ఇంత మంచి ప్రాంతాన్ని ముంచేశారని..?

ఎక్కడో దూరంగా కట్టే డ్యాంలు కూడా మనపై ప్రభావం చూపుతాయి తెలుసా? కొన్ని దేశాల గుండా ప్రవహించే నైలు లాంటి నదులపై ఆనకట్టలతో విలువ కట్టలేని మంచి నీరు, విద్యుత్ మనకు అందుతాయి. అయితే, అదే సమయంలో దిగువనున్న దేశాల గమనమే ఒక్కోసారి మారిపోతుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా డ్యాంలు సృష్టిస్తున్న సరికొత్త చరిత్ర, సమూల మార్పులను ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)