కరోనావైరస్ భయంతో పొగ తాగడానికి 'గుడ్ బై' చెప్పిన స్మోకర్లు

కోవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిన తర్వాత సుమారు 10 లక్షల మంది పొగ తాగడాన్ని వదిలిపెట్టారని చారిటీ యాక్షన్ ఆన్ స్మోకింగ్ అండ్ హెల్త్ (ASH) నిర్వహించిన సర్వే తెలిపింది.

గత నాలుగు నెలల్లో పొగ తాగడాన్ని వదిలిపెట్టిన వారిలో 41 శాతం మంది కరోనావైరస్‌కి భయపడే వదిలి పెట్టినట్లు చెప్పారు.

లండన్ యూనివర్సిటీ కాలేజీ కూడా 2007 నుంచి నిర్వహిస్తున్న సర్వే ఆధారంగా ఈ సంవత్సరంలో చాలా మంది ధూమపానాన్ని వదిలిపెట్టారని తెలిపింది.

గత సంవత్సరాలతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం మొదటి నుంచి జూన్ 2020 వరకు ఎక్కువ మంది పొగ తాగడానికి స్వస్తి చెప్పారని తెలిసింది.

పొగ తాగేవారు కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని ప్రభుత్వ వైద్య, ఆరోగ్య మార్గనిర్దేశాలు చెబుతున్నాయి.

ఆష్ సంస్థ తరుపున యుగవ్ పోలింగ్ సంస్థ ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు తమతో నమోదైన వారిలో 10000 మందిని వారి ధూమపాన అలవాట్ల గురించి ప్రశ్నించింది.

ఈ సర్వే ద్వారా వచ్చిన ఫలితాలు యూకేలో పొగ తాగడం వదిలిపెట్టిన వారిని అంచనా వేయడానికి ఉపయోగపడ్డాయి.

గత నాలుగు నెలల్లో పొగ తాగడం మానేసిన వారిలో సగం మంది ఈ నిర్ణయం తీసుకోవడానికి కోవిడ్-19 ప్రభావితం చేసిందని తెలిపారు. ఆరోగ్యం గురించి విచారం, ఒంటరిగా ఉంటున్నప్పుడు పొగాకు లభించే అవకాశాలు తక్కువ కావడం, లేదా సామాజిక ధూమపానం తక్కువ కావడం లాంటి అంశాలు కూడా ఉండి ఉండవచ్చు.

లండన్ యూనివర్సిటీ కాలేజీలో ఒక బృందం నిర్వహిస్తున్న స్మోకింగ్ టూల్ కిట్ అధ్యయనంలో భాగంగా 2007 నుంచి ప్రతి నెలా ఇంగ్లండ్ లో 1000 మందిని వారి పొగ తాగే అలవాట్ల గురించి ప్రశ్నిస్తున్నారు.

సర్వేలో పాల్గొన్న వారిలో 2007 నుంచి సగటున 5. 9 శాతం మంది ప్రతి సంవత్సరం పొగ తాగడం మానేస్తున్నట్లు తెలిసింది.

బ్రిటన్ లో కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కనీసం 10 లక్షల మంది ధూమపానాన్ని వదిలి పెట్టారని ఎన్ఎస్‌హెచ్ సంస్థ డైరెక్టర్ డెబోరా ఆర్నాట్ చెప్పారు. కానీ,ఇంకా అయిదు వంతుల మంది ప్రజలు పొగ తాగే అలవాటును వదిలి పెట్టలేదు.

2019లో సేకరించిన లెక్కల ప్రకారం యూకేలో సుమారు 70 లక్షల మంది ప్రజలు పొగ తాగుతారు.

ఎన్‌ఎస్‌హెచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ సంస్థ ఆర్ధిక సహాయంతో దేశంలో అత్యధిక శాతం మంది పొగ తాగే వారు నివసించే ప్రాంతాలలో పొగ తాగడం వదిలి పెట్టమనే (స్టాప్ స్మోకింగ్) ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

న్యూ కాసిల్ లో నివసించే టెరెన్స్ క్రాగ్స్ కూడా కోవిడ్ పరీక్షలో నెగటివ్ వచ్చినప్పటికీ హాస్పిటల్ లో కొన్ని రోజులు ఆక్సిజన్ సహాయంతో గడపడం వలన, పొగ తాగడాన్ని వదిలి పెట్టారు.

"నేను శ్వాస తీసుకోవడం చాలా కష్టమైపోయేది” అని ఆయన చెప్పారు. "గాలి కోసం వెతుక్కునే వాడిని. ఒత్తిడి వలన ఊపిరి తీసుకోవడం ఇంకా కష్టంగా ఉండేది”.

పొగ తాగడం వలన కలిగే ముప్పు ఏమిటి?

జ్వరం, ఆగకుండా దగ్గు, ఊపిరి తీసుకోలేకపోవడం లాంటి కరోనావైరస్ లక్షణాలు పొగ తాగని వారి కంటే పొగ తాగే వారిలో 14 శాతం అధికమని జో కోవిడ్ సింప్టం ట్రాకర్ ద్వారా లభించిన సమాచారం సూచిస్తోంది.

ఈ యాప్ ని సుమారు 20 లక్షల 40 వేల మంది నుంచి సేకరించిన సమాచారంతో కింగ్స్ కాలేజీ లండన్, సెయింట్ థామస్ హాస్పిటల్ లో పరిశోధన కర్తలు తయారు చేశారు.

కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన వారిలో పొగ తాగని వారి కంటే పొగ తాగే వారు రెండింతలు మంది హాస్పిటల్ లో చేరినట్లు ఈ విశ్లేషణ తెలిపింది.

హాస్పిటల్ లో చేరిన వారిలో పొగ తాగని వారి కంటే పొగ తాగే వారు 1. 8 శాతం ఎక్కువ ఉన్నారని అమెరికాలో జరిగిన పరిశోధన కూడా వెల్లడి చేస్తోంది.

జో అధ్యయనంలో పాల్గొన్న కొద్ది మంది పొగ తాగేవారిలో కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన వారిలో తీవ్రమైన కరోనావైరస్ లక్షణాలు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కొన్ని అధ్యయనాలు కరోనావైరస్ కి రక్షణగా ధూమపానం పని చేస్తుందని పేర్కొన్నాయి. ఇది హాస్పిటల్లో చేరిన రోగుల్లో చాలా తక్కువ మంది పొగ తాగేవారు ఉన్నప్పుడు ఏర్పడిన పరిస్థితి అయి ఉండవచ్చు.

"వైరస్ శరీరంలోని కణాలలోకి చేరేందుకు నిరోధించడానికి సహకరించే రిసెప్టర్లను నికోటిన్ కూడా నిరోధిస్తుండడానికి కొన్ని వివరణలున్నాయి” అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ లో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ లో పని చేస్తున్న డాక్టర్ జేమీ హార్ట్మన్ బోయిస్ చెప్పారు.

అయితే ఈ వాదనకి క్లినికల్ ఆధారాలు స్పష్టంగా లేవని చెప్పారు.

"ఇది అన్ని అధ్యయనాలలో ఒకేలా లేదు. ఈ అధ్యయనాల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎంత వరకు నమ్మగలమో అనే విషయం పట్ల స్పష్టత లేదు” అని ఆమె చెప్పారు.

పొగ తాగడం వలన వచ్చే ఉపయోగం కన్నా ఆరోగ్యం దెబ్బ తినే అవకాశాలు ఎక్కువని ఆమె చెప్పారు.

"పొగ తాగడం వలన ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ లు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ పేర్కొంటోంది.

"పొగ తాగడం వలన ఊపిరితిత్తులకు, శ్వాస నాళాలకు, రోగ నిరోధక శక్తికి హాని కలిగి ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని తగ్గిస్తుంది”.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)