'చైనా మా ఊళ్లోకి చొరబడిందని మాకందరికీ తెలుసు... లేకపోతే సైన్యాన్ని ఎందుకు మోహరిస్తారు?'
భారత్, చైనా వివాదాస్పద సరిహద్దు ప్రాంతానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే మాన్ గ్రామం దృశ్యాలివి.
ప్రఖ్యాతిగాంచిన పాంగోంగ్ సరస్సును ఆనుకునే ఈ గ్రామం ఉంటుంది. మే నెలలో భారత్, చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినట్లుగా వార్తలొచ్చింది ఇక్కడే.
ఎల్‌ఏసీకి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకు లద్దాఖ్‌తో సంబంధాలు పూర్తిగా తెంపేశారు. ఈ ప్రాంతంలో కమ్యూనికేషన్లను సైతం నిలిపివేశారు. ఇక్కడి స్థానికులతో మాట్లాడటం ఇప్పుడు చాలా కష్టం.
అయితే మాన్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మాకు ఈ దృశ్యాలు పంపించారు.
"చైనా సరిహద్దును ఆనుకుని ఉండే పాంగోంగ్ లేక్ వద్ద ఉన్న మాన్ గ్రామం నుంచి నేనిప్పుడు మాట్లాడుతున్నా. కరోనా లాక్‌డౌన్ కానీ, సరిహద్దు ఘర్షణల ప్రభావం కానీ మాపై ఏమీ లేదు. ఇక్కడ మా కదలికలపై ఎటువంటి ఆంక్షలూ లేవు. వ్యవసాయ పనులు ఎప్పటిలాగే సాగుతున్నాయి. అంతా మాములుగానే ఉంది" అని మాన్ గ్రామస్థుడు డోర్జే అన్నారు.
ఇక నాంగ్యాల్ 15 రోజుల కిందటే డర్బోక్ లేహ్ వచ్చారు. ఆయన నివసించే గ్రామం వాస్తవ నియంత్రణ రేఖకు పక్కనే, భారత్ వైపు ఉంటుంది.
"ఏమీ జరగకపోతే భారీగా సైన్యాన్ని ఎందుకు మోహరిస్తున్నారు? చైనా సైన్యం చొచ్చుకొని వచ్చిందనే విషయం మా అందరికీ తెలుసు. మొదట్లో ఫింగర్-8 వరకు మేం వెళ్లే వాళ్లం. కానీ ఇప్పుడు చైనా ఫింగర్-4 వరకు చొచ్చుకొని వచ్చింది. గల్వాన్ వ్యాలీలోని గడ్డి భూముల్లో మా గుర్రాలను స్వేచ్ఛగా మేపుకునేవాళ్లం. కానీ ఇప్పుడు దాన్ని చైనా నియంత్రిస్తోంది. ఈ చర్యల అర్థం ఏమిటి? చొరబాటు జరిగినట్లే కదా?" అని నాంగ్యాల్ అన్నారు.
ఎల్ఏసీ.. అంటే వాస్తవాధీన రేఖ అనేది చైనా, భారత్‌లను విభజిస్తున్న, అధికారికంగా గుర్తింపులేని సరిహద్దురేఖ. ఈ ఎల్ఏసీ ప్రాంతమంతా రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉండిపోయింది. భారత్, చైనాల మధ్య సరిహద్దు ఘర్షణలు తమ జీవితాలను కష్టాల్లోకి నెడుతున్నాయని సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైనా బలగాలు చొచ్చుకు వస్తాయేమోనని, చిన్నపాటి యుద్ధాన్ని తలపించే పరిస్థితులు తలెత్తుతాయేమోనని తాము ఎప్పుడూ భయపడుతూనే ఉంటామని వీరు అంటున్నారు. ఈ సరిహద్దు సమస్యకు భారత్, చైనా ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేంత వరకూ ఇక్కడి ప్రజల జీవితాల్లో శాంతి అనేది ఉండదు. వారి భవిష్యత్తు ఎప్పుడూ అనిశ్చితిలోనే ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- గల్వాన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- 'భారత సైనికులను ఎవరినీ నిర్బంధంలోకి తీసుకోలేదు' - చైనా
- కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?
- వయసు 100.. సంతానం 1600కిపైగా.. 50 ఏళ్లుగా సంతానోత్పత్తిలోనే.. ఇప్పుడు విశ్రాంతి
- కరోనా వైరస్ సోకిన తల్లులు బిడ్డకు పాలివ్వొచ్చా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది
- లాక్డౌన్లో ఆన్లైన్ పాఠాలు.. జుగాడ్ ట్రైపాడ్‌తో అందరి ప్రశంసలు అందుకున్న టీచర్
- సియాచిన్: అక్కడ నిద్రలో కూడా సైనికుల ప్రాణాలు పోతుంటాయ్!
- కరోనావైరస్: 'మతం భవిష్యత్తు' ఎలా ఉంటుంది, ఆచారాలు పద్ధతులు ఎలా మారతాయి
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)