అంతర్జాతీయ జీవ వైవిధ్య దినం: జంతు ప్రపంచంలో కొన్ని ఆసక్తికర వాస్తవాలు
మే 22వ తేదీ జీవ వైవిధ్య అంతర్జాతీయ దినం (International Day for Biological Diversity).
ఈ నేపథ్యంలో కొన్ని జీవుల గురించి ఆసక్తికరమైన వాస్తవాలు మీ కోసం..
మీకు తెలుసా?
గుడ్ల గూబలకు 3జతల కను రెప్పలుంటాయి. ఒకటి శుభ్రపరచుకునేందుకు, ఇంకొకటి రెప్పలు వేసేందుకు, మరొకటి నిద్రపోయేందుకు
ఆవులు నిద్రలో కలలు కంటాయి కూడా. నేలపై పడుకుంటేనే సుమా!
పఫిన్లు తమ గూళ్లు కట్టుకునేటప్పుడుఓ వైపు టాయిలెట్ కూడా నిర్మించుకుంటాయి.
జెంటూ జాతికి చెందిన పెంగ్విన్లు తమ జీవిత భాగస్వామికి గులకరాళ్లను ఇచ్చి ప్రపోజ్ చేస్తాయి.
ప్రతి మిణుగురు పురుగుకి ప్రత్యేకమైన ఫ్లాష్ కోడ్ ఉంటుంది.
ఉత్తర అమెరికాలో ఉండే ఓ రకమైన కప్పలు శీతాకాలంలో గడ్డ కట్టి, వేసవి మొదలయ్యేసరికి మళ్లీ యథాస్థితికి వస్తాయి.
నీటి పిల్లులు చేతులు ముడుచుకొని నిద్రపోతాయి. అందువల్ల నీటి ప్రవాంలో కొట్టుకుపోకుండా ఉంటాయి.
ప్రపంచంలో అత్యంత వేగంగా పంచ్ ఇవ్వాలంటే అది పికాక్ మంటిస్ ష్రింప్‌కు మాత్రమే సాధ్యం.
ధ్రువపు ఎలుగుబంట్ల రోమాలు స్పటికంలా ఉంటే, చర్మం మాత్రం నల్లగా ఉంటుంది.
కోలాల వేలి ముద్రలు మనషుల్ని పోలి ఉంటాయి. క్రైం సీన్లను తారుమారు చెయ్యగలవు కూడా.
పాండాలకు రోజులో సగం తినడంతోనే సరిపోతుంది.
పులికోచ(ఓ రకమైన సాలి పురుగు) రెండేళ్ల పాటు ఆహారం లేకుండా జీవించగలదు.
ఇవి కూడా చదవండి:
- మనుషుల అవయవాలు జంతువుల్లో వృద్ధి - ఈ పరిశోధనల లక్ష్యం ఏంటి
- అమెరికా: జంతువుల ఎక్స్రేలు చూస్తారా..
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: నిజంగా 50 కోట్ల జంతువులు చనిపోయాయా?
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- మృగరాజుకు క్రిస్మస్ బహుమతి బాగా నచ్చింది
- ఈ ఘానా కుర్రాడు 50 పైగా జంతువుల అరుపులు వినిపిస్తాడు
- అంతులేని ప్రశ్న: రోజుకు ఎన్ని జంతువులు పుడుతున్నాయి?
- విషపూరిత కప్పలు... వాటిని నేర్పుగా తినే ఎలుకలు
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- పామాయిల్: మీ వంటనూనె, సౌందర్య సాధనాలు అడవి జంతువుల్ని ఎలా చంపేస్తున్నాయంటే..
- పులులు, ఎలుగుబంట్లు, మొసళ్లు ఈయన నేస్తాలు
- మనిషి మాట్లాడడం ఎప్పుడు మొదలుపెట్టాడు...
- సింహాలు, ఖడ్గమృగాలు, ఏనుగుల మధ్యలో క్రికెట్ ఆడదామా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)