You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బాంబుల శబ్దానికే కాదు.. ఇప్పుడు మాములు పరిస్థితుల్లో కూడా ఈ చిన్నారి నవ్వుతోంది
బాంబుల శబ్దం వినిపించినప్పుడల్లా ఆ ఒత్తిడిని అధిగమించేందుకు తన తండ్రితో కలిసి నవ్వుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన సిరియా చిన్నారిని తమ దేశంలోని సురక్షిత ప్రాంతానికి చేర్చినట్టు టర్కీ వెల్లడించింది.
సిరియాకు చెందిన సాల్వా అనే మూడేళ్ల చిన్నారి వీడియో గత నెలలో వైరల్ అయ్యింది. ఇడ్లిబ్‌లోని తన ఇంటికి సమీపంలో యుద్ధ విమానాలు జారవేసే బాంబుల శబ్దాలను వింటూ ఆడుకోవడం ఆ వీడియోలో కనిపించింది.
అయితే ఆ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన వారం రోజుల తర్వాత ఆమె కుటుంబాన్ని సరిహద్దులు దాటి సురక్షిత ప్రాంతానికి చేర్చడంలో టర్కీ ప్రభుత్వం సాయపడింది. సిరియాలోని ఇడ్లిబ్ తిరుగుబాటుదారులకు గట్టి పట్టున్న ప్రాంతం.
వైమానిక దాడుల్ని ఎదుర్కొనేందుకు సాల్వా, ఆమె తండ్రి అబ్దుల్లా మొహమ్మద్ ఓ వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు.
బాంబుల శబ్దానికి భయపడే బదులు శబ్దం వినిపించినప్పుడల్లా నవ్వుతూ ఉండాలని తన బిడ్డకు చెప్పారు అబ్దుల్లా.
ఫలితంగా అంత భయానక పరిస్థితిలో కూడా ప్రశాంతంగా ఆడుకుంటూ సంతోషంగా ఉండగల్గేది సాల్వా.
బాంబుల శబ్దాలు అవసరం లేదు
వారి పరిస్థితిని అర్థం చేసుకున్న టర్కీ ప్రభుత్వం తమ దేశానికి వచ్చేందుకు వారికి అనుమతిచ్చింది. ప్రస్తుతం వాళ్లకు రేహన్లలోని శరణార్ధి శిబిరంలో ఆశ్రయమిచ్చారు.
శరణార్ధి శిబిరంలో ఆ తండ్రీకూతుళ్లను చూసిన గార్డియన్ పత్రికకు చెందిన రిపోర్టర్ మెక్‌కెర్నన్... మొదటిసారిగా ఆమె సాధారణ పరిస్థితుల్లో కూడా నవ్వగల్గుతోందంటూ ట్వీట్ చేశారు.
టర్కీ చేరుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని, సాల్వాకు బడికెళ్లే అవకాశం వచ్చిందని టర్కీ మీడియా ద్వారా అంతర్జాతీయ సమాజానికి తెలియజేశారు అబ్దుల్లా.
టర్కీ ఇప్పటి వరకు 37లక్షల మంది సిరియా శరణార్ధులకు ఆశ్రయమిచ్చింది.
ఇవి కూడా చదవండి
- నెల్లూరు పల్లెలో అంతరిక్ష పరిశోధన... ఒక సైన్స్ టీచర్ ప్రేరణతో విద్యార్థుల ప్రయోగాలు
- ‘దేవుణ్ణి పూజించాలి, గే వివాహాలను నిషేధించాలి’ - రాజ్యంగంలో సవరణలు తీసుకొచ్చేందుకు సిద్ధమైన పుతిన్
- కరోనావైరస్: కోట్లాది మంది ప్రాణాలు తీసిన స్పానిష్ ఫ్లూ నుంచి మనం నేర్చుకోగల పాఠాలేమిటి?
- ఇంటర్ విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దీనికి పరిష్కారం ఏంటి?
- అమరావతి ఉద్యమంలో పెరుగుతున్న కేసులు... జైళ్ళలో ఉద్యమకారులు
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్లను అడ్డుకుంటుందా
- ఉత్తర కొరియా: కొత్త సంవత్సరంలో రెండు క్షిపణుల పరీక్ష
- నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా
- తెలంగాణలో తొలి కరోనావైరస్ కేసు నమోదు
- దిల్లీలో అలర్లు చేయించేందుకు ముస్లింలకు డబ్బులు పంచారా? : Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)