పోప్ ఫ్రాన్సిస్: 'ఫోన్లు పక్కన పెట్టండి.. కుటుంబ సభ్యులతో మాట్లాడండి'

ఫొటో సోర్స్, Getty Images
ఫోన్లు పక్కన పెట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని ప్రజలకు పోప్ ఫ్రాన్సిస్ పిలుపు ఇచ్చారు. భోజనం చేసేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని ఆయన సూచించారు. జీసస్, మేరీ, జోసెఫ్ కూడా ఇలాగే చేసేవారని పోప్ చెప్పారు.
"వాళ్లు (జీసస్, మేరీ, జోసెఫ్) ప్రార్థించారు, పనిచేశారు, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు" అని సెయింట్ పీటర్స్ స్క్వైర్ వద్ద కిక్కిరిసిన ప్రజలను ఉద్దేశించి చెప్పారు.
"మన కుటుంబంతో మనం మాట్లాడటం తిరిగి ప్రారంభించాలి" అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.
సోషల్ మీడియా వాడటంలో పోప్ ఫ్రాన్సిస్ చాలా ఆసక్తి చూపిస్తారు. ప్రజలు ఆయనతో తరచూ సెల్ఫీలు దిగుతూ ఉంటారు.

ఫొటో సోర్స్, Reuters
"మీ కుటుంబంతో ఎలా మాట్లాడాలో మీకు తెలుసా? లేదా భోజనం చేసేటప్పుడు కూడా ఫోన్లలో చాటింగ్ చేసే పిల్లల మాదిరిగానే మీరూ ఉన్నారా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను" అని పోప్ అన్నారు.
"అలాంటి చోట ఎంత మంది ఉన్నా ఎవరూ మాట్లాడరు. మౌనమే రాజ్యమేలుతుంది" అని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు.
తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు, అక్కాచెల్లెళ్లు, చర్చి ఫాదర్లు అందరూ ఇక నుంచి ఫోన్లు పక్కన పెట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టాలని పోప్ సూచించారు.
"ఇక్కడ లేదా బసిలికా లోపల ఇలాంటి వేడుకలు జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది ప్రజలు, చివరికి చర్చి అధికారులు, బిషప్‌లు కూడా ఫోన్లు పట్టుకుని నాకు కనిపిస్తారు. ఇది చాలా బాధాకరం" అని ఆయన అన్నారు.
ట్విటర్‌లో 18 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్న పోప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.
ప్రజలు ఫోన్లుకు అతుక్కుపోవడంపై పోప్ తరచూ మందలిస్తూనే ఉన్నారు.
"వేడుకకు నాయకత్వం వహిస్తున్న ఒక మత పెద్ద ఒక దశలో 'మా మనసులను మెరుగుపర్చండి' అని అంటారు. ఫోటోలు తీసుకోవడానికి మొబైల్స్ పైకి ఎత్తండి అని ఆయన అనరు. ఇలా చేయడం చాలా వికారమైన విషయం" అని 2017లో పోప్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- సొంత ఇంటర్నెట్ను సృష్టించుకుంటున్న రష్యా.. దేశీయ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది?
- థాయ్లాండ్ గుహలో రెస్క్యూ ఆపరేషన్లో సోకిన ఇన్ఫెక్షన్తో నేవీ సీల్ సభ్యుడి మృతి
- జపాన్లో డబ్బులిచ్చి ఉద్యోగాలు మానేస్తున్నారు.. ఎందుకు
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
- కొన్ని చర్చిల్లో మహిళలను 'సెక్స్ బానిసలు'గా చేశారు - అంగీకరించిన పోప్ ఫ్రాన్సిస్
- ‘‘వాటికన్ ఒక గే సంస్థ’’: క్రైస్తవ పూజారుల ‘రహస్య జీవితాలు బట్టబయలు చేసిన’ జర్నలిస్టు
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్లో ఎందుకు కొనసాగుతోంది
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు... ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- ఫోల్డింగ్ ఫోన్ల మీద శాపం 2020లో తొలగిపోతుందా?
- శాండా బల్లి: మనుషుల 'మగతనం' కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఎడారి జీవి
- ఫేస్బుక్కు ఒక కోడ్ పంపించారు.. భారీ మొత్తంలో నగదు బహుమతి కొట్టేశారు..
- ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమా?
- వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








