నాసా: అంటార్కిటికాలో దీర్ఘచతురస్రం ఆకారంలో ఐస్‌బర్గ్

ఫొటో సోర్స్, NASA
ఐస్‌బర్గ్ ఎలా ఉంటుంది? అనగానే ఓ మంచు కొండ ఠక్కున కళ్ల ముందు మెదులుతోందా? కానీ కొండలా నిటారుగా కాకుండా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఓ మంచు శకలం ఫోటోను నాసా విడుదల చేసింది.
అంటార్కిటికాలోని వెడ్డెల్ సముద్రంపై తేలియాడుతున్న ఈ దీర్ఘచతురస్రాకార మంచు శకలాన్ని నాసా గుర్తించింది.
ఉపరితలం చదునుగా ఉండి, పదునైన మొనలు లేదా అంచులు కలిగివున్న ఈ ఐస్‌బర్గ్.. ఈ మధ్యనే మరో పెద్ద మంచు కొండ నుంచి విరిగిపోయినట్లుగా తెలుస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది.
సముద్రపు అలల దాటికి మొద్దుబారక, దీని మొనలు ఇంకా పదునుగానే ఉన్నాయి.
ఈ ఫోటోను గత వారం నాసా రీసర్చ్ ప్లేన్ చిత్రీకరించింది. ఇలాంటి ఐస్‌బర్గ్‌లు కొత్తవేం కాదు. వీటిని ట్యాబ్యులార్ ఐస్‌బర్గ్ అని అంటారు.
పొడవుగా, చదునుగా ఉండే ఈ ట్యాబ్యులార్ ఐస్‌బర్గ్‌లు పెద్ద పెద్ద ఐస్ షెల్ఫ్ చివర్ల నుంచి విడిపోయి, ఇలా కనిపిస్తాయి.
మనకు గోర్లు పెరిగి, పొడవుగా అయ్యాక వాటి చివర్లు ఏవిధంగా విరిగిపోతాయో అలానే ఇలాంటి శకలాలు కూడా విరిగిపోతాయని నాసా, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన శాస్త్రవేత్త కెల్లీ బ్రంట్ వివరించారు.
''ఇవి గణిత శాస్త్రంలో వివరించే చతురస్రం, దీర్ఘచతురస్రం.. ఇలాంటి ఆకారాల్లో ఉండటమే వింతగా అనిపిస్తుంది'' అని కెల్లీ బ్రంట్ అన్నారు.
ప్రస్తుతం నాసా విడుదల చేసిన ఫోటోలోని ఐస్‌బర్గ్.. ఆర్కిటిక్ ప్రాంతంలోని 'లార్సెన్-సి' అనే ఐస్ షెల్ఫ్ నుంచి వచ్చింది.
ఫోటోలో చూసి, ఈ మంచు శకలం ఎంతపెద్దదో చెప్పడం కష్టమే. కానీ దీని కొలతలు అటు నుంచి ఇటువైపుకు 1.6 కి.మీ.కు మించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
- ఒక్క కోడిని కూడా చంపకుండా చికెన్ తినడం ఎలా?
- భారత్‌లోని అసమానతలను అంతరిక్షంలోంచి చూడొచ్చు
- వృద్ధాప్యం ఎందుకొస్తుంది? ఇవిగో... 9 కారణాలు
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- అభిప్రాయం: పార్లమెంట్ ద్వారానే రామమందిరం నిర్మిస్తామన్న భగవత్ ప్రకటనలో అర్థమేంటి?
- పాకిస్తాన్ దేశ చరిత్రలోనే కటిక చీకటి రాత్రి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








