శరీరం వెలుపల చిట్టి గుండె: క్షేమంగా ఇంటికి చేరిన చిన్నారి

వీడియో క్యాప్షన్, శరీరం బయట గుండెతో చిన్నారి... సురక్షితంగా ఇంటికి

హెచ్చరిక: ఈ వీడియోలో కలవరపరిచే దృశ్యాలున్నాయి.

యూకేకు చెందిన వానిలోప్ విల్కిన్స్ అనే చిన్నారికి పుట్టుక తోనే గుండె శరీరం వెలుపల ఉంది. మూడు శస్త్ర చికిత్సలు చేసి వైద్యులు ఆ గుండెను శరీరం లోపల అమర్చారు. బ్రెస్ట్ బోన్‌ను అభివృద్ధి చేసేందుకు ఆమెకు మళ్లీ సర్జరీ చేస్తారు.

ఈ చిన్నారి కడుపులో ఉండగానే, గుండె శరీరం బయట ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లలో విల్కిన్స్ గుండె స్పష్టంగా బయటివైపు కొట్టుకుంటూ కనిపించింది.

పుట్టిన వెంటనే శస్త్ర చికిత్స కోసం చిన్నారిని యూకేలోని లెస్టర్ నగరానికి తరలించారు. ఇప్పటిదాకా మూడు సర్జరీలు చేసి వైద్యులు ఆమె గుండెను శరీరం లోపల పెట్టారు. ఛాతీ భాగానికి ఊతంగా ఒక బ్రేస్‌ను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతానికి రాత్రుళ్లు చిన్నారిని ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులకు అనుమతిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)