డిజైనర్ మీసాలు... వెరైటీ గడ్డాలు

గడ్డాలు, మీసాలు, కురుల పోటీ

మీకు మీసాలు, గడ్డాల పోటీల గురించి తెలుసా.. చిత్ర విచిత్ర ఆహార్యంతో నార్త్ ఇంగ్లిష్ టౌన్ ఆఫ్ బ్లాక్ పూల్లో జరిగే ఈ పోటీల్లో ప్రపంచం నలుమూలల నుంచీ 200 కు పైగా అభ్యర్థులు సందడి చేస్తున్నారు.

వయసు, జాతి, మతాలతో సంబంధం లేకుండా మీసం మెలేస్తూ పోటీలకు సై అంటున్నారు.

వీడియో క్యాప్షన్, తీరొక్క కురులు.. విచిత్ర పోటీలు

మొత్తం 21 విభాగాల్లో ఇక్కడ కురుల వేడుకలు జరుగుతాయి. ఈ పోటీలలో అన్ని రకాల కేశాలంకరణలు కనిపిస్తాయి. అత్యుత్తమ గడ్డం, అత్యుత్తమ మీసం, పూర్తి గడ్డం, ఫ్రీ స్టైల్. పెట్టుడు గడ్డాలు కూడా కనిపిస్తుంటాయి.

''చాలా మందికి తమ గడ్డం అంటే ఇష్టం . కొంతమందైతే ఆ గడ్డానికి బానిసలైపోతారు కూడా . వారు ఆ గడ్డాన్ని ప్రాణంగా ప్రేమిస్తారన్నమాట. ఈ వేడుకలో చాలా విలక్షణమైన వ్యక్తులు కూడా ఉంటారు. నిజానికి, తమ లాంటి వారితో కలసి తిరగడం వారికి చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది'' అని ఒక పోటీదారు వ్యాఖ్యానించారు.

అన్ని రకాల గడ్డాలు, మీసాలు పెంచుకునే వాళ్లు ఇక్కడ కన్పిస్తారు. విలక్షణ యురోపియన్లు, ఆంగ్లేయులు, గుబురు మీసాలతో, వెరైటీ గడ్డాలతో ఈ పోటీల్లో పాల్గొంటారు.

రెండేళ్లకోసారి జరిగే ఈ బ్రిటిష్ గడ్డాలు, మీసాల పోటీలు చాలా పేరుంది. ఈ పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. విజేతల మీద ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)