అబార్షన్ హక్కు కోసం పోరాడుతున్న అర్జెంటీనా మహిళలు

వీడియో క్యాప్షన్, అబార్షన్ హక్కు కోసం పోరాడుతున్న అర్జెంటీనా మహిళలు

లాటిన్ అమెరికా దేశాలలో ఒకటైన అర్జెంటీనా పార్లమెంటులో ఈరోజు ఓ చరిత్రాత్మక బిల్లు‌పై ఓటింగ్ జరగబోతోంది. గర్భధారణ తర్వాత పధ్నాలుగు వారాల్లో చేసే అబార్షన్‌ను చట్టబద్ధం చేసే బిల్లు పాసవుతుందా లేదా అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది.

ప్రస్తుతం అక్కడ అబార్షన్ చట్టవిరుద్ధం. కేవలం అత్యాచార సంఘటనల్లో లేదా గర్భం ధరించిన మహిళ ప్రాణానికి ఏదైనా ప్రమాదం ఉంటేనో అబార్షన్ చేయొచ్చు.

ఒకవేళ ఈ బిల్లును ఆమోదిస్తే, అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన లాటిన్ అమెరికా దేశాల్లో నాల్గో దేశంగా అర్జెంటీనా అవతరించనుంది. ఈ బిల్లుకు అనుకూల, వ్యతిరేక వర్గాలు రోడ్ల మీదకు వచ్చి తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నాయి.

భారతదేశంలో 1971లోనే అబార్షన్లకు చట్టబద్ధత లభించింది.

మరోవైపు, ఐర్లండ్ రిపబ్లిక్‌లో.. సరిగ్గా రెండు నెలల క్రితం, రెఫరెండం ద్వారా ఓటింగ్ ప్రక్రియను చేపట్టి, అబార్షన్‌కు చట్టబద్ధత కల్పించారు.

అయితే, అర్జెంటీనాలో జరుగుతున్నట్లే, ఐర్లండ్‌లో కూడా కేథలిక్ చర్చి అబార్షన్‌పై నిషేధాన్ని కొనసాగించేందుకు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరింది.

ప్రస్తుతం అక్కడ అబార్షన్ చట్టవిరుద్ధం. కేవలం అత్యాచార సంఘటనల్లో లేదా గర్భం ధరించిన మహిళ ప్రాణానికి ఏదైనా ప్రమాదం ఉంటేనో అబార్షన్ చేయొచ్చు.

ఒకవేళ ఈ బిల్లును ఆమోదిస్తే, అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన లాటిన్ అమెరికా దేశాల్లో నాల్గవ దేశంగా అర్జెంటీనా అవతరించనుంది. ఈ బిల్లుకు అనుకూల, వ్యతిరేక వర్గాలు రోడ్ల మీదకు వచ్చి తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నాయి.

భారతదేశంలో 1971లోనే అబార్షన్లకు చట్టబద్ధత లభించింది.

మరోవైపు, ఐర్లండ్ రిపబ్లిక్‌లో.. సరిగ్గా రెండు నెలల క్రితం, రెఫరెండం ద్వారా ఓటింగ్ ప్రక్రియను చేపట్టి, అబార్షన్‌కు చట్టబద్దత కల్పించారు.

అయితే అర్జెంటీనాలో జరుగుతున్నట్లే, ఐర్లండ్‌లో కూడా కేథలిక్ చర్చి అబార్షన్‌పై నిషేధాన్ని కొనసాగించేందుకు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)