మెక్సికో: అభ్యర్థులకు ప్రాణాంతకంగా మారిన ఎన్నికలు

వీడియో క్యాప్షన్, మెక్సికో: అభ్యర్థులకు ప్రాణాంతకంగా మారిన ఎన్నికలు

మెక్సికోలో జులై 1న ఆదివారం సార్వత్రిక ఎన్నికలు మొదలుకానున్నాయి. ప్రచార కార్యక్రమం అభ్యర్థులకు, వారి మద్దతుదారులకు ప్రాణాంతకంగా మారుతోంది.

2017 సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు 130 మంది రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారు. వీరిలో 48 మంది ఆదివారం జరుగనున్న ఎన్నికల్లో అభ్యర్థులు.

మెక్సికో చరిత్రలో అతిపెద్ద ఎన్నికలు ఇవే. స్థానిక, జాతీయ స్థాయిల్లో 3,400కు పైగా పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో అధ్యక్ష పదవి, కాంగ్రెస్ స్థానాలు కూడా ఉన్నాయి.

మెక్సికో

ఫొటో సోర్స్, Getty Images

నిరుడు 30 వేల హత్యలు

మెక్సికో ఆధునిక చరిత్రలో గత ఏడాది అత్యధిక హత్యలు జరిగాయి. 2017లో సుమారు 30 వేల మంది హత్యకు గురయ్యారు. నేరాల్లో అత్యధికం మాదకద్రవ్యాల ముఠాల ప్రమేయమున్నవే.

మూడు నెలల్లో 8 వేల మంది హత్య

డ్రగ్ మాఫియాపై ప్రభుత్వాలు సైన్యాన్ని పూర్తిస్థాయిలో ప్రయోగించి చూశాయి. అయినా ఈ మాఫియా కారణంగా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.

ఈ సంవత్సరం గత ఏడాది కన్నా ఎక్కువ హింస జరుగుతోంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే దాదాపు 8 వేల హత్యలు జరిగాయి.

వీడియో క్యాప్షన్, మెక్సికో: నేరాలతో ముదురుతున్న సంక్షోభం (ఏప్రిల్‌లో పబ్లిష్ అయిన వీడియో)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)