చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకెళ్లి చైనాలో అమ్ముకుంటున్నారు

ఫొటో సోర్స్, iStock
ఆస్ట్రేలియాలో చంటి పిల్లల ఆహారానికి తీవ్ర కొరత ఏర్పడడంతో వాటి విక్రయాలపై ఆంక్షలు విధించారు. ఈ కొరతను ఎదుర్కోవడానికి ఒక సూపర్ మార్కెట్ చెయిన్, బేబీ ఫుడ్‌ను నిజంగా అవసరం ఉన్న తల్లిదండ్రులకే విక్రయించేందుకు వీలుగా వాటిని కౌంటర్లలో కనిపించకుండా చేయాలని నిర్ణయించింది.
ఆస్ట్రేలియాలోని రెండు అతి పెద్ద సూపర్ మార్కెట్ల చెయిన్స్‌లో 'కోల్స్' ఒకటి. గత కొన్నేళ్లుగా సూపర్ మార్కెట్లలో కొంటున్న బేబీ ఫుడ్‌ను విదేశాలలో, మరీ ప్రత్యేకించి చైనాలో విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీని వల్ల ఆస్ట్రేలియాలోని పిల్లలకు ఆ బేబీ ఫుడ్ దొరకడం లేదు.
ఈ బేబీ ఫుడ్ ఫార్ములాకు చైనాలో 'వైట్ గోల్డ్' అనే మారు పేరుంది. చైనాలో లభించే ఉత్పత్తుల కన్నా దీనిని సురక్షితమైనది, మేలైనదిగా భావిస్తారు.
దీంతో కొందరు ఆస్ట్రేలియా పౌరులు దీనిని లాభసాటి వ్యాపారంగా మార్చుకొని, వాటిని కొని, విదేశాలకు పంపుతున్నారు.
సిడ్నీ నుంచి వెలువడే 'డైలీ టెలిగ్రాఫ్' కథనం ప్రకారం, బేబీ ఫుడ్‌ను ఆస్ట్రేలియాలో రూ.1500 రూపాయలకు కొని వాటిని చైనాలో దాదాపు రూ.6700కు విక్రయిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మా పిల్లలకు దొరకట్లేదు కానీ విదేశాల్లో విక్రయాలా?’
సిడ్నీలో ఉంటున్న జ్యోతి అనే ఓ మహిళ, తన కవల పిల్లలకు బేబీ ఫుడ్ కొనడం అసాధ్యంగా మారిందన్నారు.
''ఒక్కోసారి వాటి కోసం నేను ఐదారు దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎక్కడికి వెళ్లినా ఖాళీ షెల్ఫ్‌లు దర్శనమిస్తున్నాయి'' అని జ్యోతి అన్నారు.
''ఇక్కడ మేం ఆస్ట్రేలియాలోని మా పిల్లలకు ఆహారం పెట్టాలనుకుంటుంటే, ఇతరులు మాత్రం వాటిని విదేశాల్లో విక్రయిస్తున్నారు'' అని తెలిపారు.
ఇటీవలి కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. కోల్స్ ఫేస్‌బుక్ అకౌంట్‌లో పరిమితికి మించి బేబీ ఫుడ్‌ను విక్రయిస్తున్న వీడియోలు, చిత్రాలను పోస్ట్ చేశారు. అవసరమైన వారికే బేబీ ఫుడ్‌ను విక్రయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, iStock
కొత్త నిబంధనలు
దీనిని అరికట్టడానికి కోల్స్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వాటి ప్రకారం ఈ బేబీ ఫుడ్‌ను ఇకపై కొన్ని దుకాణాలలో మాత్రమే విక్రయిస్తామని కోల్స్ తెలిపింది. అంతే కాకుండా వాటిని విక్రయించే సందర్భంలో వాటిని కొనుగోలు చేస్తున్నవారికి నిజంగా వాటి అవసరం ఉందా అని విచారించాకే విక్రయిస్తారు. వాటిని ఇకపై డిస్‌ప్లేలో కూడా పెట్టరని కోల్స్ తెలిపింది.
ఇక కోల్స్ ప్రత్యర్థి 'వూల్‌వర్త్స్' ప్రతి కస్టమర్ కేవలం రెండు టిన్నుల బేబీ ఫుడ్‌ను మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన విధించింది.
ఈ బేబీ ఫుడ్‌ను ఉత్పత్తి చేసే బెలామీ కంపెనీ - 2015లో ఆ బేబీ ఫుడ్‌ను తగినంత సరఫరా చేయలేకపోతున్నందుకు క్షమాపణలు కోరింది. దానిని విదేశాలలో విక్రయిస్తుండడమే కొరతకు కారణమని బెలామీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ఈ వీడియో చూస్తే ఇక ఎన్నడూ ఆహారం వృధా చేయరు!
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
- కేకులు, బన్నులు తింటే కేన్సర్ వస్తుందా?
- హలో.. మీరు ఈ చికెన్‌ని తింటారా?
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
- ఏం చేసినా బరువు తగ్గట్లేదా? ఈ ఐదూ కారణాలు కావొచ్చు..
- ఆలు చిప్స్‌పై 76 శాతం పన్ను.. సమర్థించిన కోర్టు
- కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకులు దొరకని దుస్థితి
- రంజాన్ నెలలో ఉపవాసం చేస్తే శరీరానికి ఏం జరుగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








