GOLDEN GLOBES: ఇదీ మహిళా శక్తి
75వ గోల్డన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ నటీనటులలో అత్యున్నత ప్రతిభ కనబరచిన వారికి పురస్కారాలు ప్రదానం చేశారు. ఇదే సభలో హలీవుడ్‌లో తలెత్తిన లైంగిక వేధింపుల గురించి కూడా చర్చకు వచ్చింది.
హాలీవుడ్‌లో లైంగిక వేధింపుల అంశం తెరపైకి వచ్చాక జరిగిన మొదటి పెద్ద అవార్డు వేడుక ఇదే.
ఈ వేడుకలో తారలు, నల్లటి దుస్తులు ధరించడం ద్వారా లైంగిక వేధింపులకు గురైన బాధితులకు మద్దతు తెలిపారు.
ఈ చర్య ద్వారా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తమ వాణిని వినిపించారు.
ఈ వేడుకను ప్రారంభిస్తూ " ఇది 2018, ఇక్కడ లైంగిక వేధింపులకు తావు లేదు." అని హోస్ట్ సేథ్ మేయర్స్ అన్నారు.

ఫొటో సోర్స్, TARA ZIEMBA
ఇదే వేడుకలో, "మీ టూ" అనాల్సిన ఆగత్యం రాని ఒక కొత్త ఉదయం ఆరంభమవ్వాల్సి ఉంది అని సేసిల్ బి డేమిల్ అవర్డ్ గ్రహీత ఓఫ్రా విన్‌ఫ్రే అన్నారు.
విన్‌ఫ్రే ఉపన్యాసం విని తారలందరూ లేచి నిలబడి చప్పట్లుకొట్టి మద్దతు తెలిపారు.
ఈ వేడుకలో హాలీవుడ్‌లోని తాజా పరిస్థితులపై దృష్టిసారించారు.
అందరూ "మీ టూ" మరియు "టైమ్ ఈజ్ అప్" ప్రచారాలకు మద్దతు తెలిపారు.
ఉత్తమ సహయ నటి అవార్డ్ గెలుచుకున్న అమెరికా డ్రామా సీరీస్ "బిగ్ లిటిల్ లైస్" నటి లారా డెర్న్ కూడా "నిజాన్ని నిర్భయంగా చెప్పాలని అదే పిల్లలకూ నేర్పించాలని" అన్నారు

ఫొటో సోర్స్, TARA ZIEMBA
"త్రీ బిల్బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిసౌరి" కి బెస్ట్ ఫిల్మ్ డ్రామా అవార్డ్ వచ్చింది.
ఈ ఫిల్మ్‌కి నాలుగు అవార్డులు వచ్చాయి. ఈ ఫిల్మ్‌లో హీరోయిన్ ఫ్రాన్సెస్ మెక్‌డెర్మాండ్‌కు ఉత్తమ నటి అవార్డ్ లభించింది.
మహిళా శక్తి
నటి కిడ్మాన్ కి గృహహింస బాధితురాలిగా చేసిన నటనకు అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్‌ను ఆవిడ తన తోటి మహిళలకు, కూతుర్లకు, తన తల్లికి అంకితమిస్తూ "ఇదీ మహిళా శక్తి" అన్నారు.
వీళ్ళే కాకుండా, ఈ వేడుకలో, చాలామంది సినిమా మరియు టివి నటీనటులు ప్రభావవంతమైన ప్రసంగాలు చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









