కొలరాడో షూటింగ్: ఒక పోలీసు అధికారి మృతి, మరో నలుగురికి గాయాలు

డెన్వర్‌కు దక్షిణాన ఉన్న ప్రాంతంలో కాల్పులు జరిగిన అపార్ట్‌మెంట్

ఫొటో సోర్స్, DENVER 7

ఫొటో క్యాప్షన్, డెన్వర్‌కు దక్షిణాన ఉన్న ప్రాంతంలో కాల్పులు జరిగిన అపార్ట్‌మెంట్

కొలరాడోలో జరిగిన కాల్పులలో ఒక పోలీసు అధికారి మృతి చెందగా, మరో నలుగురు అధికారులు గాయపడ్డారు.

డెన్వర్‌కు దక్షిణంగా ఉన్న హైల్యాండ్స్ రాంచ్‌లో ఈ కాల్పులు జరిగాయి.

ఓ అపార్ట్‌మెంట్‌లో గొడవ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు, ఆ ప్రాంతానికి వెళ్లగా అనుమానితుడు వారిపై అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు.

అనంతరం పోలీసుల కాల్పుల్లో అనుమానితుడు మృతి చెందాడు.

ఆస్తి గొడవలే ఈ కాల్పులకు కారణమని తెలుస్తోంది.

ఇద్దరు వ్యక్తులను తన అపార్ట్‌మెంట్‌లోనికి పిల్చిన అనుమానితుడు వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వారిద్దరూ గాయపడ్డారు.

సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతవాసులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. సంఘటన జరిగిన ప్రాంతానికి బాంబ్ స్క్వాడ్‌ను రప్పించారు.

అమెరికాలో సుమారు 30 కోట్ల తుపాకులు ఉంటాయని అంచనా - అంటే దాదాపు జనాభాలోని ప్రతి ఒక్కరికీ ఒక గన్‌ ఉన్నట్లు లెక్క

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికాలో సుమారు 30 కోట్ల తుపాకులు ఉంటాయని అంచనా - అంటే దాదాపు జనాభాలోని ప్రతి ఒక్కరికీ ఒక గన్‌ ఉన్నట్లు లెక్క

మరణించిన పోలీసు అధికారి 29 ఏళ్ల జకారి పారిష్ అని, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు.

గాయపడిన నలుగురు పోలీసు అధికారుల పరిస్థితి నిలకడగా ఉంది.

అనుమానితుడికి ఎలాంటి క్రిమినల్ రికార్డూ లేదని పోలీసులు తెలిపారు. తన రైఫిల్‌తో అతను సుమారు 100 రౌండ్ల కాల్పులు జరిపాడని వివరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కాల్పుల్లో మరణిచించిన పోలీసు అధికారి కుటుంబానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం తెలిపారు.

అమెరికా చరిత్రలోనే కొలరాడోలో అత్యంత ఎక్కువగా కాల్పులు జరిగాయి. 1999లో కొలంబైన్ హైస్కూల్‌లో జరిగిన కాల్పుల్లో అత్యధికంగా 12 మంది విద్యార్థులు సహా 13 మంది మృతి చెందారు.

'గన్ వయోలెన్స్ ఆర్కైవ్' అన్న వెబ్‌సైట్ తయారు చేసిన జాబితాను బట్టి, 2017లో అమెరికాలో తుపాకీ కాల్పుల్లో 15,000 మందికి పైగా మృతి చెందారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)