మహిళలు నడిపే ఈ రోడ్డుపక్క ఇడ్లీ కొట్టు ఇంత ఫేమస్ ఎలా అయ్యింది?
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా, కరంగల్‌పాలయంలో ఉన్న ఒక చిన్న కొట్టు ఇడ్లీలకు చాలా ఫేమస్. మహిళల ఆధ్వర్యంలో ఓ కుటుంబం నడిపే ఈ కొట్టుకు... పెళ్లిళ్లు, పండగల ఆర్డర్లు భారీగా వస్తుంటాయి. ఈ మహిళలు రోజుకు వెయ్యి నుంచి లక్ష వరకూ ఇడ్లీలను తయారు చేస్తుంటారు. సమయానికి ఆర్డర్లు డెలివరీ చేస్తుంటారు.
ఈ ఇడ్లీల కొట్టు నిర్వాహకురాలు అనసూయ కాంతిమతి బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఈ వ్యాపారాన్ని మేం సంప్రదాయంగా నడుపుతూ వస్తున్నాం. ముందుగా మా అమ్మ దీన్ని నడిపారు. మేం దీన్ని 40 ఏళ్లుగా నడుపుతున్నాం.
మేం పెళ్లిళ్ల ఆర్డర్లు తీసుకుంటాం. 2, 3 వేల ఇడ్లీలు తయారు చేస్తాం. రిటైల్ సేల్స్‌లో మేం కస్టమర్లకు సాంబార్, చట్నీలతో పాటు అడిగినన్ని ఇడ్లీలు సర్వ్ చేస్తాం.
జనాలు మమ్మల్ని ఈరోడ్ మార్కెట్ అని పిలుస్తారు. ఇడ్లీ షాప్ ఎక్కడుందని అడిగితే చిన్న పిల్లలు కూడా చూపిస్తారు.

మేం చాలా రకాల ఇడ్లీలు తయారు చేస్తాం. మినీ ఇడ్లీ, తట్టు ఇడ్లీ, హార్ట్ షేప్డ్ ఇడ్లీ, వెజిటబుల్ ఇడ్లీ...
మేం వాటిని మా దగ్గరైనా చేస్తాం లేదా మ్యారేజి హాల్స్ లేదా ఫంక్షన్ హాల్స్‌కు వెళ్లి చేస్తాం.
మేం ఇడ్లీలను చాలా శుచిగా, శుభ్రంగా తయారు చేస్తాం.
మా కుటుంబం అంతా ఈ వ్యాపారంలో ఉంది. మా చెల్లెళ్లు, వదినలు, మరదళ్లు, అత్తలు... ఇలా. మేం ఇతరుల ఆదాయంపైన ఆధారపడి బతకం. మా వ్యాపారం మా సొంతం.
ఎలాంటి సమస్యలూ లేకుండా నడిచే వ్యాపారం ఇది.
మా కొట్టులో ఇడ్లీల కోసం జనం ఎదురు చూస్తుంటారు. అక్కడే మరో 10-15 కొట్లున్నా, అవి తయారయ్యేంత వరకూ ఆగి తిని వెళ్లిపోతారు.
ఈరోడ్ జిల్లా మొత్తంలోకి మా షాపే ఫేమస్’’ అన్నారు.
ఈ షాపుకు వచ్చిన వినియోగదారుల్లో ఒకరైన సెంథిల్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఈరోడ్ ఇడ్లీ మార్కెట్ చాలా ఫేమస్. పెళ్లిళ్లకైనా, ఫంక్షన్లకైనా వీళ్లు చాలా క్వాలిటీ ఇడ్లీలు తయారు చేస్తారు. ఎప్పుడు వచ్చినా సరే, మాకు వెంటనే ఇడ్లీలు దొరుకుతాయి. మా ఇంట్లో ఓ ఫంక్షన్ అయితే, అప్పటికప్పుడు వచ్చేసి ఇడ్లీలు తీసుకెళ్లాం. అర్జెంట్ అవసరాలున్నా వీరి దగ్గరి నుంచి ఇడ్లీలు పట్టుకెళ్లొచ్చు. మేం రెగ్యులర్‌గా ఇక్కడికి వస్తుంటాం. వెయ్యి, రెండు వేల ఇడ్లీలు ఆర్డర్ చేయాలన్నా, ఇక్కడ చాలా తొందరగా దొరుకుతాయి. వీళ్లు తయారు చేసే సాంబార్, చట్నీ కూడా చాలా బాగుంటాయి’’ అని చెప్పారు.

‘‘పెళ్లిళ్లు, చెవులు కుట్టించడం, ఆలయ వేడుకలు, అనాథాశ్రమాలు.... ఇలా అన్నింటికీ మేం కేటరింగ్ చేస్తాం.
మేం రోజుకు 10 వేల నుంచీ 50 వేల ఇడ్లీల వరకూ తయారు చేస్తాం.
ఒక ఆలయ ఉత్సవానికైతే మేం లక్ష ఇడ్లీలు కూడా తయారు చేశాం. మా క్లయింట్లు మాకు తప్ప మరెవ్వరికీ ఆర్డర్లు ఇవ్వరు. వాళ్లకు మాపై చాలా నమ్మకం. వాళ్ల నమ్మకాన్ని మేం నిలబెడతాం. ఎంత కష్టమైనా సరే... జనాలు మా ఇడ్లీలు తిని, బాగున్నాయని మెచ్చుకుంటే చాలు మా హృదయం ఉప్పొంగిపోతుంది. మా శ్రమనంతా మర్చిపోతాం’’ అన్నారు అనసూయ కాంతిమతి.
ఇవి కూడా చదవండి:
- ప్రయాగ్‌రాజ్ హింస: బుల్డోజర్లతో కూల్చేసిన ఈ ఇంటిలో ఉండే జావెద్ మొహమ్మద్ ఎవరు?
- పెట్రోల్, డీజిల్ ఆదా చేసే ట్రిక్స్‌లో అపోహలు, 5 వాస్తవాలు
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




