రూ.6 లక్షలకు కొన్న ఎద్దు.. పోటీల్లో రూ.35 లక్షలు గెలిచింది

వీడియో క్యాప్షన్, రూ.6 లక్షలకు కొన్న ఎద్దు.. పోటీల్లో రూ.35 లక్షలు గెలిచింది

మహారాష్ట్రలోని కవాతే-మహంకాళ్ గ్రామంలో జరుగుతున్న బుల్‌రేస్‌లో హరణ్య అనే ఎద్దు ప్రవేశించగానే, ఈ పోటీలో గెలిచేది ఆ ఎద్దేనని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే అదే విజయం సాధించింది.

ఈ రేసులో విజేతగా నిలిచిన హరణ్య-సోన్యా ఎద్దుల జోడీకి కొల్హాపూర్‌కు చెందిన సందీప్, సచిన్ పాటిల్‌లు యజమానులు.

ఈ పోటీలో మొదటి బహుమతి గెలిచిన వీరికి లక్ష రూపాయలు లభించాయి.

45 వరకు ఎద్దుల బండ్లు ఈ రేసులో పాల్గొన్నాయి.

అయితే, ఈ పోటీలో మొదటి బహుమతి లక్ష రూపాయలైతే, హరణ్య ధర 35 లక్షల రూపాయలు.

దానికి జోడీగా వచ్చిన మరో ఎద్దు ధర 10 లక్షల రూపాయలు.

ప్రతి విజయానికి తమ ఎద్దుల ధర పెరుగుతూ వస్తోందని వాటి యజమానులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)