వీడియో: సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దులాట

వీడియో క్యాప్షన్, సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దులాట

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మ‌క‌ర రాశిలో ప్ర‌వేశించే స‌మ‌యంలో సంక్రాంతి జ‌రుపుకుంటారు.

సంక్రాంతి సమయంలో తెలుగు ప‌ల్లెల‌న్నీ పాడిపంట‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. ఈ సంబరాల్లో రంగ‌వ‌ల్లులు, పిండివంట‌ల‌తో పాటు డూడూ బ‌స‌వ‌న్న‌ల‌కు కూడా ఎంతో ప్రాధాన్య‌ం ఉంది.

ఈ పండుగ వేళ వ్య‌వ‌సాయంలో అత్యంత ముఖ్యమైన ఎద్దుల్లో బ‌లిష్ట‌మైన ఎద్దును ఎంచుకుని తాడిపెద్దుగా ప్ర‌క‌టించేవారు. భ‌విష్య‌త్ సంప‌ద పెంచే జంతువుగా తాడిపెద్దుకి ఆద‌ర‌ణ ఉండేది. అదే స‌మ‌యంలో తాడిపెద్దుల‌లో కొన్ని కాలం తీరిన ఎద్దుల‌ను గంగిరెద్దులుగా మార్చేవారు.

కొందరు ఈ గంగిరెద్దుల‌ను అందంగా అలంకరించడం, వాటిని ఊరూరా తిప్పి, విన్యాసాలు చేయడాన్ని జీవనోపాధిగా మార్చుకున్నారు.

వ్యవసాయం ఆధునికతను సంతరించుకున్నా సంప్ర‌దాయంగా వ‌చ్చిన గంగిరెద్దులాట మాత్రం ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో క‌నిపిస్తోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)