వనమా రాఘవేంద్ర: ఆస్తి వివాదాలు, అక్రమ సంబంధాల ఆరోపణలు... రామకృష్ణ కుటుంబం మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి

వీడియో క్యాప్షన్, ఆస్తి వివాదాలు, అక్రమ సంబంధాల ఆరోపణలు... రామకృష్ణ కుటుంబం మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి

తెలంగాణలో పాలక టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రపై ఆరోపణలు చేస్తూ పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం సహా ఆత్మహత్య చేసుకున్నారు.

రామకృష్ణ తన సూసైడ్ నోట్‌లో రాఘవేంద్రపై తీవ్ర ఆరోపణలు చేశారు.

తాను చనిపోవడానికి ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలలోనూ ఆయన వనమా రాఘవేంద్రపై ఆరోపణలు చేశారు.

తమ కుటుంబంలోని ఆస్తి వివాదాన్ని పరిష్కరించాలంటే తన భార్యను ఆయనకు అప్పగించాలని రాఘవేంద్ర కోరారని రామకృష్ణ ఆరోపించారు.

తన సోదరితో రాఘవేంద్రకు వివాహేతర సంబంధం ఉందని రామకృష్ణ ఆరోపించారు.

ఇంతకూ నలుగురి మరణించిన ఈ ఘటన వెనుక వాస్తవాలు ఏమిటి? 'బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్'..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)