డ్రగ్స్ పార్టీ కేసులో ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ ఎందుకు రావట్లేదు?

వీడియో క్యాప్షన్, డ్రగ్స్ పార్టీ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఎందుకు రావట్లేదు?

క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ కేసుకు సంబంధించి అక్టోబరు 3న బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది.

కానీ ఇప్పటి వరకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాలేదు.

అక్టోబరు 20న ఆర్యన్‌తోపాటు మరో ఇద్దరు నిందితులకు బెయిల్ జారీ చేసేందుకు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది.

''ఆర్యన్ దగ్గర నుంచి ఎలాంటి డ్రగ్స్‌నూ స్వాధీనం చేసుకోలేదు. అయితే, అతడి మిత్రుడు అర్బాజ్ ఖాన్ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని ఆయనకు తెలుసు. వారిద్దరూ కలిసే ఉన్నారు. దీన్ని కూడా నేరంగానే (కాన్షియస్ పొసెషన్) పరిగణించాలి''అని బెయిల్ తిరస్కరించే సమయంలో కోర్టు వ్యాఖ్యానించింది.

అర్బాజ్ మర్చెంట్ నుంచి ఆరు గ్రాముల ''చరస్‌''ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పూర్తి సమాచారం పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)