తెలుగు రాష్ట్రాలలో విధ్వంసం సృష్టించిన గులాబ్ తుపాను

వీడియో క్యాప్షన్, తెలుగు రాష్ట్రాలలో విధ్వంసం సృష్టించిన గులాబ్ తుపాను

గులాబ్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. యాస్ తుపాను వచ్చిన నాలుగు నెలలకే తాజా తుపాను విరుచుకుపడుతోంది.

శ్రీకాకుళం జిల్లాపై గులాబ్ తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించింది. శ్రీకాకుళం సిటీతో పాటు తీరప్రాంత గ్రామాలపై గులాబ్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

30 ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతవాసులను 1500 మందిని తరలించామని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు.

తుపాను ప్రభావం కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్‌ నెంబరు 08942-240557, 6309990933లను సంప్రదించాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)