తెలంగాణలో డ్రోన్లతో వ్యాక్సీన్ డెలివరీ

వీడియో క్యాప్షన్, తెలంగాణలో డ్రోన్లతో వ్యాక్సీన్ డెలివరీ

వైద్య సౌకర్యాలు సరిగ్గా లేని గ్రామాలకు సమయానికి ఔషధాలు, ఆరోగ్య సేవలు అందించడం ఎప్పటికీ సవాలే. వీలైనంత త్వరగా మారుమూల గ్రామాలకు వైద్య సేవలు అందించడానికి డ్రోన్‌ల ద్వారా ఔషధాల పంపిణీని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.

దేశంలోనే తొలిసారిగా ఆకాశమార్గాన బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్... అంటే కనుచూపు మేరలో లేని ప్రాంతాలకు డ్రోన్‌ను పంపి వైద్య సేవలు అందించబోతున్నారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ భాగస్వామ్యంతో మెడిసిన్ ఫ్రమ్ స్కై పేరుతో తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 11న వికారాబాద్‌లో ఈ సేవలను ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ డ్రోన్‌ మెడిసిన్‌ సేవలు మొదలయ్యాయి.

వికారాబాద్‌లో మొదలైన మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్ట్ ట్రయల్స్‌లో మారుత్ డ్రోన్స్, బ్లూ డార్ట్ వంటి ఎనిమిది సంస్థలు ముప్పై రోజుల పాటు ట్రయల్స్ నిర్వహిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)