You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నారాయణ్ రాణె: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొడతానన్న కేంద్ర మంత్రి అరెస్ట్.. బెయిల్‌పై విడుదల
కేంద్ర మంత్రి నారాయణ్ రాణెను మహారాష్ట్రలో పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టాలని అన్నారన్న ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు స్థానిక కోర్టు రూ.15 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
రాణె వ్యాఖ్యల తరువాత ముంబయిలో బీజేపీ, శివసేన కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.
ముంబయిలో నారాయణ్ రాణె నివాసం ఎదుట కూడా శివసేన కార్యకర్తలు ఆందోళన చేశారు.
ఇంతకీ ఏమిటీ వివాదం
వారం రోజుల కిందట భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్ట్ 15న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రె జెండా ఎగరవేసిన సందర్భంగా ప్రసంగించారు.
అయితే, ఆ ప్రసంగ సమయంలో ఆయన స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందని తన వెంట ఉన్న సహాయకుడిని అడిగారని, ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో కూడా తెలియని ఠాక్రెను చెంప దెబ్బకొట్టాలని నారాయణ్ రాణె అన్నారు.
సోమవారం ఓ సభలో మాట్లాడిన రాణె... ''ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో కూడా తెలియదు. నేనే కనుక అక్కడుంటే చెంప పగులగొట్టేవాడిని'' అన్నారు.
రాణె వ్యాఖ్యలపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రాజకీయ కుట్రతోనే తనపై కేసు పెట్టారని నారాయణ్ రాణె అంటున్నారు.
''స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చిందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు. తన ప్రసంగ సమయంలో ఆయన తన వెనుకనున్నవారిని అడిగారు'' అన్నారు రాణె.
బీజేపీకి చెందిన నారాయణ్ రాణె అరెస్టుతో మహారాష్ట్రలోని పాలక శివసేన, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
రాష్ట్రంలో ఉద్రిక్తతలు రగల్చడానికే కేంద్ర మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేశారని శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు.
అయితే, కేంద్ర మంత్రి అయిన రాణెను అరెస్టు చేయడం రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని బీజేపీ నాయకులు అంటున్నారు.
శివసేన నుంచి కాంగ్రెస్.. కాంగ్రెస్ నుంచి బీజేపీ
ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిగా ఉన్న నారాయణ్ రాణె 2005 వరకు శివసేనలోనే ఉండేవారు.
2005లో శివసేనను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అనంతర కాలంలో బీజేపీలో చేరారు.
మరోవైపు 2019 వరకు శివసేన కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోనే ఉండేది.
గత మహారాష్ట్ర ఎన్నికల సమయంలోనూ కలిసి పోటీచేసిన ఈ రెండు పార్టీలు ఆ ఎన్నికల తరువాత విడిపోయాయి.
తనను సీఎం చేయడానికి బీజేపీ అంగీకరించకపోవడంతో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రెను ఎన్డీయే నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌కు 'కాబుల్ కసాయి' హిక్మత్యార్ ఇచ్చిన సలహా ఏంటి?
- బీజేపీకి రూ.2.5 వేల కోట్ల విరాళాలు.. ఎలక్టోరల్ బాండ్లపై మళ్లీ తలెత్తుతున్న ప్రశ్నలు
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)