You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పెగాసస్ స్పైవేర్: మోదీ ప్రభుత్వ తీరుకు నిరసనగా టీపీసీసీ ‘చలో రాజ్‌భవన్’ - Newsreel
పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి మోదీ ప్రభుత్వం విపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతరులపై నిఘా పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు జులై 22న 'చలో రాజ్‌భవన్' కార్యక్రమం చేపడుతున్నారు.
ఇందుకోసం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ను అనుమతి కోరారు.
జులై 22 ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ వద్దకు కాంగ్రెస్ నేతలు చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం అందిస్తారు.
ఆధార్‌లోని మీ ఫోన్ నెంబర్ ఇంటి దగ్గరే ఇకపై ఇలా మార్చుకోవచ్చు
మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి ఇంతకు ముందులాగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. పోస్ట్‌మ్యాన్ సాయంతో ఇంటి దగ్గర, లేదంటే దగ్గర్లోని పోస్టాఫీసులో కూడా దీనిని అప్‌డేట్ చేసే అవకాశం ఉంది.
ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికెషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఒక ఒప్పందానికి వచ్చాయి.
దీని ప్రకారం మీ ఏరియాలోని పోస్ట్‌మ్యాన్ కూడా మీ మొబైల్ నంబర్‌ను ఆధార్ డేటాలో అప్‌డేట్ చేయగలరు.
దేశవ్యాప్తంగా ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులకు చెందిన 650 శాఖలతోపాటు, 1 లక్షా 46 వేలమంది గ్రామీణ డాక్ సేవకులు ఈ సేవలకు అందుబాటులో ఉంటారు. ''ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ సర్వీసు ఇకపై పోస్టాఫీసుల్లో, పోస్ట్‌మెన్ దగ్గర కూడా లభ్యమవుతాయి'' అని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్, సీఈఓ జె.వెంకటరాము ఒక ప్రకటనలో వెల్లడించారు.ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్స్ మొబైల్ అప్‌డేట్ సేవలను మాత్రమే అందిస్తుంది. త్వరలోనే పిల్లల ఆధార్ రిజిస్ట్రేషన్ కూడా ఈ నెట్‌వర్క్ ద్వారా చేయవచ్చునని ఐపీపీబీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్: సైబర్ దాడితో భారత ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి
- జెఫ్ బెజోస్: అమెజాన్ అధిపతి అంతరిక్ష యానం ప్రత్యేకతలేంటి
- మైక్రోసాఫ్ట్ సర్వర్లపై సైబర్ దాడి ఆరోపణలను ఖండించిన చైనా
- ఎంతమంది పిల్లల్ని కనాలో నిర్ణయించేది ఎవరు? ప్రభుత్వమా, మహిళలా?
- దూది కోట రహస్యం: స్వర్గంలాంటి ప్రదేశానికి ‘నరక ద్వారం’ అని పేరెందుకు వచ్చింది
- వెక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆగాలంటే ఏం చేయాలి?
- అంతరిక్షంలోకి 82 ఏళ్ల వృద్ధురాలు, జెఫ్ బెజోస్‌తో కలిసి రేపు ప్రయాణం
- విశాఖ జిల్లాలో 25 గ్రామాల ప్రజలు వారంవారం ఆ చెట్టు దగ్గరకు చేరుకుంటారు.. కారణం ఇదీ
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నదీ జలాలపై రివర్ బోర్డులకు పెత్తనం ఇస్తే ఏం జరుగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)