సాఫ్ట్ సిగ్నల్: సూర్యకుమార్ యాదవ్ ఔటైన ఈ నిబంధన ఏంటి... దానిపై ఎందుకింత చర్చ?

ఫొటో సోర్స్, SURJEET YADAV/GETTY IMAGES
మార్చి 18న భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ-20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ 'సాఫ్ట్ సిగ్నల్' ప్రకారం ఔట్ అవడంతో ఈ నిబంధన గురించి జోరుగా చర్చ మొదలైంది.
ఆడిన తొలి టీ-20 మ్యాచ్‌లోనే జోరు చూపించిన యాదవ్ 57 పరుగులు చేశాడు. 14వ ఓవర్‌లో అతడు శామ్ కరన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. పుల్ షాట్ కొట్టబోయి, డీప్ స్క్వేర్ లెగ్ దగ్గర డేవిడ్ మలాన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
దాంతో, ఆన్-ఫీల్డ్ అంపైర్ కేఎన్ అనంత పద్మనాభన్, టీవీ అంపైర్ వీరేంద్ర శర్మ నిర్ణయం కోరారు. ఔట్ అని సాఫ్ట్ సిగ్నల్ ఇచ్చారు.
కానీ, రీప్లేలో బంతి గడ్డిని తాకుతూ కనిపించింది. ఆ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ అసలు ఒప్పుకోలేదు. సాఫ్ట్ సిగ్నల్ నిబంధన ప్రకారం ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ నిర్ణయమే కరెక్ట్ అన్నారు.

ఫొటో సోర్స్, SURJEET YADAV/GETTY
సాఫ్ట్ సిగ్నల్ అంటే..
సాఫ్ట్ సిగ్నల్ అంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఆన్-ఫీల్డ్ అంపైర్ ఏదైనా ఒక నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు ఇవ్వడానికి ముందు చూపించే సిగ్నల్. ఆ పరిస్థితిలో బ్యాట్స్‌మెన్ అవుటా కాదా అనే తన నిర్ణయాన్ని ఆయన చెబుతాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దీనిపై ఏమన్నాడు?
మ్యాచ్ తర్వాత మాట్లాడిన విరాట్ కోహ్లీ సాఫ్ట్ సిగ్నల్ నిబంధన గురించి అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"అంపైర్‌కు 'ఐ డోంట్ నో'(నాకు తెలీదు) లాంటి కాల్ ఎందుకు ఉండకూడదు. అక్కడ సరిగా తెలీనప్పుడు, ఫీల్డర్లకే సందేహంగా ఉన్నప్పుడు, స్క్వేర్ లెగ్ నుంచి అంపైర్ దానిని స్పష్టంగా చూడగలరని, నిర్ణయాత్మక కాల్ ఇవ్వగలరని నాకైతే అనిపించడం లేదు" అన్నాడు.
"ఇలాంటి నిర్ణయాలు మొత్తం ఆట దిశను, ముఖ్యంగా ఒక పెద్ద గేమ్‌నే మార్చేయవచ్చు. భారత జట్టు ఈరోజు ఈ నిబంధనకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రేపు మరో జట్టుకు కూడా ఇదే జరగచ్చు,
అందుకే, మీరు వీలైనంత వరకూ ఇలాంటివి పరిష్కరించాలని అనుకుంటుంటే, ఆటను సరళంగా, లీనియర్ ఉంచాలి, నిబంధనల ఒక సెట్ గ్రే ఏరియాలో ఉండకూడదు" అని చెప్పాడు.
"ఒక హై ప్రెషర్ ఆటలో.. ఇలాంటి పరిస్థితి రావడం మంచిది కాదు. మైదానంలో ఇంకా ఎక్కువ స్పష్టత అవసరం" అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆటగాళ్లు, నిపుణులు ఏమంటున్నారు
కొంతమంది మాజీ ఆటగాళ్లు ఇదే విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. భారత మాజీ టెస్ట్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దీనిపై ట్వీట్ కూడా చేశాడు.
"ఇది అవుట్ ఎలా అవుతుంది. మీరంత అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించి, అన్నిసార్లు రీప్లే చూశాక కూడా.. క్యాచ్ సరిగా పట్టారా, లేదా అనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తర్వాత ఫీల్డ్-అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నిబంధనపై మళ్లీ చర్చ జరగాలని, దీన్ని మార్చాలని నాకు అనిపిస్తోంది" అన్నాడు.
ఇంగ్లండ్ ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు కూడా సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను విమర్శించారు. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ దీనిని 'స్టింకింగ్' నిర్ణయం అన్నాడు.
ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఒక ట్వీట్‌లో "ఈ సాఫ్ట్ సిగ్నల్ వింతగా ఉంది. దానికి భిన్నంగా చెప్పడం ఆఫ్-ఫీల్డ్ అంపైర్‌కు చాలా కష్టంగా ఉంటుంది" అని రాశాడు.
సాఫ్ట్ సిగ్నల్‌కు అంపైర్ ఇచ్చే రీజన్ నమోదవుతుందని హర్షా భోగ్లే అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"రీప్లేలో క్లీన్ క్యాచ్ కనిపించదు. ఎందుకంటే అది 3-డీ ఈవెంట్‌కు సంబంధించిన 2-డీ ఇమేజ్. అందుకే ఫీల్డర్ వేళ్లు బంతి కిందున్నాయా, లేదా అనేది అంపైర్ చూస్తారు. దానిలో కొంత సందిగ్ధత ఉంటుంది. కానీ, టెక్నాలజీలో దీనికి ఇంకా ఏ సమాధానం లేదు. అంటే, మనకు త్రీడీ కెమెరాలు అవసరమా?" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: మొదటి టీ20 మ్యాచ్‌లో ఇండియా ఓటమికి ఐదు కారణాలు ఇవీ...
- India vs England: రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం.. ఇషాన్, కోహ్లీ హాఫ్ సెంచరీలు
- అక్షర్ పటేల్: ఒకప్పటి ఫాస్ట్‌బౌలర్ ఇప్పుడు సంచలన స్పిన్నర్‌గా ఎలా మారాడు
- అహ్మదాబాద్ టెస్ట్: భారత్- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ గెలుచుకున్న కోహ్లీ సేన
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక
- చెన్నై సూపర్ కింగ్స్‌లో సీమ కుర్రాడు: ‘ధోనీతో ఒక్క ఫొటో దిగితే చాలనుకున్నా... ఇప్పుడు కలిసి క్రికెట్ ఆడబోతున్నా’’
- కడక్‌నాథ్ కోళ్లు, స్ట్రాబెర్రీలు: ఎంఎస్ ధోనీ ఎలా వ్యవసాయం చేస్తున్నారో చూశారా?
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- అజింక్య రహానె: భారత్ క్రికెట్‌కు కెప్టెన్‌ను చేయాలంటూ డిమాండ్లు. కోహ్లీపై ఒత్తిడి పెరుగుతోందా ?
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఏంటి గొడవ? ఆ అడ్డుగోడలు కూలేదెలా?
- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: భారత క్రికెట్‌ను మార్చిన ఒక మ్యాచ్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








